కూతురికి కరోనా పేరు పెట్టుకున్న మహిళా ఎంపీ
ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న సమస్య కరోనా వైరస్. దీని ప్రభావం తగ్గకపోవడంతో భారత్‌లో లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించడం తెలిసిందే.
ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న సమస్య కరోనా వైరస్. దీని ప్రభావం తగ్గకపోవడంతో భారత్‌లో లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించడం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నాడు తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ ఓ పాపకు జన్మనిచ్చారు. కరోనా వ్యాప్తి సమయంలో పుట్టిన తమ పాపకు ముద్దు పేరు ‘కరోనా’ అని నామకరణం చేశారు. బికినీలో అమెరికన్ అందం హాట్ పోజులు
అపరూప పొడ్డార్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండో పర్యాయం ఎంపీగా సేవలందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అపరూప పొడ్డార్‌కు రెండో సంతానంగా పాప పుట్టింది. తాను, పాప ఇద్దరూ ఆరోగ్యం ఉన్నారని స్వయంగా ఎంపీ తెలిపారు. శ్రుతి హాసన్ లేటెస్ట్ ఫోటోలు
తాను మరోసారి తండ్రి కావడంపై ఎంపీ అపరూప పొడ్డార్ భర్త షాకిర్ అలీ సంతోషంగా ఉన్నారు. కరోనా మహమ్మారి సమయంలో పుట్టిన మా పాపకు ముద్దుపేరు కరోనా అని నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత సీఎం మమతా బెనర్జీ వద్దకు వెళ్లి పాపకు నామకరణం చేయాలని కోరనున్నట్లు తెలిపారు. శుభవార్త.. బంగారం ధరలు యథాతథం
కాగా, ఇటీవల వలస కూలీల కుటుంబంలో పుట్టిన బాబుకు లాక్ డౌన్ అని నామకరణం చేయడం తెలిసిందే. మరికొందరు శానిటైజ్ అని సైతం పేర్లు పెట్టడం విచిత్రంగా కనిపించింది. తాజాగా ఎంపీ తన కూతురికి ముద్దు పేరు కరోనా అని ఇచ్చినట్లు చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!