Rath yatra vs Bike Rally: పశ్చిమ బెంగాల్‌లో వేడెక్కిన రాజకీయం, రథయాత్రకు పోటీగా బైక్ ర్యాలీ
Rathyatra vs Bike Rally: దేశం మొత్తం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వైపు చూస్తోంది. మరో 2-3 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే దీనికి కారణం. బెంగాల్ కోటపై కాషాయజెండా ఎగురవేసేందుకు బీజేపీ, మరోసారి పట్టు నిలుపుకునేందుకు టీఎంసీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
Rathyatra vs Bike Rally: దేశం మొత్తం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వైపు చూస్తోంది. మరో 2-3 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే దీనికి కారణం. బెంగాల్ కోటపై కాషాయజెండా ఎగురవేసేందుకు బీజేపీ, మరోసారి పట్టు నిలుపుకునేందుకు టీఎంసీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ( West Bengal Elections ) సమీపిస్తున్నాయి. ఏప్రిల్ మే నెలల్లో జరిగే అవకాశాలున్నాయి. ఏడాది ముందు నుంచే పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం వేడెక్కింది. ఇటీవలి కాలంగా మారుతున్న సమీకరణాలతో రాజకీయం రంజుగా మారిపోయింది. 2019 పార్లమెంట్ ( 2019 Parliament Elections ) ఎన్నికల్లో సత్తా చూపిన బీజేపీ ( BJP )..ఈసారి బెంగాల్ కోటపై కాషాయజెండా ఎగురవేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ).. బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. టీఎంసీ ( TMC ) పదేళ్ల పాలనకు చెక్ పెట్టి అధికార పీఠాన్ని ఎక్కాలనేదే బీజేపీ ఆలోచన. మరోవైపు ఎన్నికల్లో విజయం ద్వారా మరోసారి పట్టు నిలుపుకునేందుకు దీదీ ( Mamata Banerjee ) ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో పోటీ బీజేపీ వర్సెస్ టీఎంసీ (TMC ) మధ్యనే ఉండనుంది. బీజేపీ ఇవాళ్టి నుంచి అంటే ఫిబ్రవరి 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర ప్రారంభించనుంది. మరోవైపు బీజేపీ రథయాత్రకు పోటీగా టీఎంసీ బైక్ ర్యాలీ ( Bike Rally ) కు శ్రీకారం చుట్టింది. నడియా జిల్లాలో రెండ్రోజులపాటు జరిగే జన సమర్ధన్ యాత్రలో వేలాదిమంది ( Rathyatra ) పాల్గొననున్నారు. అటు బీజేపీ ఛీఫ్ జేపీ నడ్డా ( JP Nadda ) సైతం నడియా జిల్లా నుంచి పరివర్తన్ రథయాత్రను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఐదు దశల్లో సాగే ఈ యాత్ర..294 అసెంబ్లీ నియోజకర్గాల్ని చుట్టనుంది.
మరోవైపు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బలగాలు పంపాలని బీజేపీ ఇప్పట్నించే కోరుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు, ఎన్నికల ప్రక్రియ గౌరవాన్ని కాపాడేందుకు కేంద్ర బలగాలు పంపాలని కోరింది. ఎన్నికల కమీషన్‌కు వినతి పత్రం అందించింది. కేంద్ర ఎన్నికల పరిశీలకులకు, రాష్ట్ర పోలీసులు, అధికార యంత్రాంగానికి విధుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేసింది.
Also read: JEE Mains 2021: జేఈఈ మెయిన్స్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు, ఏ దశ పరీక్షలు ఎప్పుడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook