బంగారం ధర మళ్లీ పతనం.. వెండి ఢమాల్
గత నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.2000 మేర తగ్గిన బంగారం ధరలు (Gold Price Today) నేడు మరోసారి దిగొచ్చాయి.
బులియన్ మార్కెట్‌లో నేడు ధరలు దిగొచ్చాయి. గత నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.2000 మేర తగ్గిన బంగారం ధరలు నేడు మరోసారి దిగొచ్చాయి. జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. కరోనా కేసులే లేని దేశాలివే..
హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు తులం (10 గ్రాముల) బంగారం ధర రూ.30 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,100కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.40,400అయింది. Photos: బాత్‌టబ్‌లో నటి హాట్ ఫొటోషూట్
నేడు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.20 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.44,450కి దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.50 తగ్గింది. 10 గ్రాముల ధర రూ.41,850 వద్ద ట్రేడ్ అవుతోంది. Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!
కాగా, బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. 1కేజీ వెండిపై రూ.1,050 మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.41,650కి పడిపోయింది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..