Gold Price Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి
బుధవారం నాడు బులియన్ మార్కెట్‌లో పెరిగిన పసిడి ధరలు గురువారం నాడు తగ్గాయి. జ్యువెలర్లు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టినా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.
బంగారు కొనుగోలుదారులకు శుభవార్త. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు దిగొచ్చాయి. బుధవారం నాడు బులియన్ మార్కెట్‌లో పెరిగిన పసిడి ధరలు గురువారం నాడు తగ్గాయి. జ్యువెలర్లు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టినా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పసిడి ధర తగ్గడంతో నేడు కొనుగోళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రూ.70 లక్షల లాటరీ నెగ్గినా, అంతలోనే పెను విషాదం
మార్చి 12న హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల ధర రూ.280 మేర తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.45,700కు చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.320 తగ్గడంతో 10 గ్రాముల పుత్తడి ధర రూ.41,840 అయింది.
Avengers బ్యూటీ స్కార్లెట్ జాన్సన్ అందాలివిగో!
దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.43,900 అయింది. కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,700కు తగ్గింది.
See Pics: నటి అందాలకు హార్దిక్ క్లీన్ బౌల్డ్
వెండి ధరలు
బంగారం ధర పడిపోయినా వెండి ధరలో ఏ మార్పు లేదు. గురువారం మార్కెట్‌లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 1 కేజీ వెండి ధర రూ.48,500 వద్దనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 8 డాలర్లు పెరగడంతో 1 ఔన్స్ బంగారం ధర 1665 డాలర్లకు చేరుకుంది. 0.61శాతం ధర పెరగడంతో 1 ఔన్స్ వెండికి అంతర్జాతీయ మార్కెట్ ధర 17.60 డాలర్లు అయింది.
Also Read: ఆసియా అపర కుబేరుడు జాక్ మా.. ముఖేష్ అంబానీ వెనక్కి