RAW New Chief: రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ స్థూలంగా చెప్పాలంటే రా. భారతదేశ అంతర్జాతీయ నిఘా సంస్థ ఇది. ప్రతి దేశానికి ఉన్నట్టే ఇండియాకు రా ఉంది. నేరుగా ప్రధానమంత్రితో మాట్లాడే స్థాయి రా ఛీఫ్‌కు ఉంటుంది. ఇప్పుడు రా కొత్త ఛీఫ్‌గా ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి రవి సిన్హాను భారత నిఘా విభాగం రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ అధిపతిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అటు కేంద్ర మంత్రుల కమిటీ సైతం ఈ నియామకానికి ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం రా ఛీఫ్‌గా పనిచేస్తన్న సుమంత్ కుమార్ గోయెల్ జూన్ 30న రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో రా అధిపతిగా రవి సిన్హా బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్న రవి సిన్హా ప్రస్తుతంత క్యాబినెట్ సెక్రటేరియట్ స్పెషల్ సెక్రటరిగా ఉంటూ ఏడేళ్ల నుంచి రా ఆపరేషన్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.



జమ్ము కశ్మీర్, నార్త్‌ఈస్ట్ రాష్ట్రాల్లో చాలాకాలం పనిచేసిన అనుభవముంది. అంతేకాకుండా పొరుగుదేశాల స్పెషలిస్ట్‌గా రవిసిన్హాను పరిగణిస్తారు. ప్రస్తుతం రా ఛీఫ్‌గా ఉన్న గోయెల్ 2019 జూన్ నెలలో నియమితులైనా మరో రెండేళ్లు పొడిగింపు ఇవ్వడంతో ఇప్పటి వరకూ కొనసాగారు. ఫిబ్రవరి 2019లో పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ప్లానింగ్‌లో ఇప్పటి రా ఛీఫ్ గోయెల్ కీలక భూమిక వహించారు. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడికి ప్రతీకారంగా భారతదేశం ఈ సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. పుల్వామాపై టెర్రరిస్టులు జరిపిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. ఆ తరువాత దీనికి ప్రతీకారంగానే 2019 ఫిబ్రవరి 26వ తేదీన బాలాకోట్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌లో జైష్ ఎ మొహమ్మద్ శిక్షణా శిబిరం నామరూపాల్లేకుండా పోయింది. 


Also read: Rahul Gandhi Birth Day: రాహుల్ గాంధీ చిన్ననాటి పిక్స్ చూశారా..? నాన్నమ్మ ఇందిరా గాంధీతో ఆటలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook