Invest India Conference: ఇన్వెస్ట్ ఇండియా కాన్ఫెరెన్స్..ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) గురువారం సాయంత్రం ఇన్వెస్ట్ ఇండియా సమావేశంలో కీలక అంశాలపై మాట్లాడారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) గురువారం సాయంత్రం ఇన్వెస్ట్ ఇండియా సమావేశంలో కీలక అంశాలపై మాట్లాడారు. ఈ సమావేశంలో వర్చువల్ మాధ్యమంలో పాల్గొన్న ప్రధాని భారత దేశంలో కేనడా వ్యాపారావేత్తలు పెట్టుబడి పెట్టేందుకు ఎన్ని అనుకూలమైన అంశాలు ఉన్నాయో తెలిపారు.
ALSO READ : GRAND ICT Challegne: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఛాలెంజ్ పూర్తి చేస్తే.. రూ.50 లక్షలు మీకే సొంతం
ప్రధాని మోదీ మాట్లాడిన విషయాల్లో కీలకమైన అంశాలు ఇవే..
* ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో ఒక కామన్ విషయం ఉంది. ఇక్కడ పెట్టుబడిని ( Investment ) పెట్టేందుకు నిర్ణయం తీసుకునే అధికారం ఉన్న వ్యక్తులు ఉన్నారు.
* నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను...ఒక దేశంలో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు ఏం ఆలోచిస్తారు ? ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా ? రాజకీయంగా అలజడులు లేని దేశమా కాదా ? పెట్టుబడికి అనుకూలంగా ఉన్న దేశమా కాదా ? ఆ దేశంలో తగిన స్కిల్స్ ఉన్న మానవ వనరులు ఉన్నాయా లేదా ? మీ మదిలో మెదిగే ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఒకటే సమాధానం.. అదే భారత దేశం ( INDIA ).
* భారత్ - కెనడా ( Canada ) మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు అనేవి సమాంతరమైన ప్రజాస్వామ్య విలువలపై, ఇరు పక్షాల సహజ ఆసక్తులపై ఆధారపడి ఉన్నాయి.
* భారత్ - కెనాడా మధ్య వాణిజ్యం, పెట్టుబడులు అనేవి మన బంధాల్లో భాగంగా జరిగేవి మాత్రమే.
ALSO READ| NPS Alert: NPS ఖాతాదారులకు శుభవార్త.. ఇంట్లో కూర్చొనే నామినీ వివరాలు మార్చే సదుపాయం
* కోవిడ్-19 ( Covid-19 ) సమస్య తగ్గిన తరువాత ఎన్నో సమస్యలు కంటిముందు కనిపిస్తాయి. అందులో చాలా వాటికి పరిష్కారం భారత్ వద్దే ఉంటుంది. అంటే సప్లై చేయిన్, పీపీఈ కిట్స్ వంటి విషయంలో భారత్ ప్రపంచానికి ఆధారంగా మారింది.
* ఫార్మా రంగంలో భారతదేశం వాటా, పాత్ర కీలకం. ఇప్పటి వరకు మేము 150 దేశాలకు మందులు, ఇతర వైద్యోపకరణాలు సరఫరా చేశాం.
* ఈ ఏడాది మార్చి - జూన్ మధ్యలో వ్యవసాయ ఎగుమతులు 23 శాతం పెరిగాయి.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR