డీటీహెచ్ ( DTH ), కేబుల్ టీవీ ( Cable TV ) వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త తెలిపింది. ఇకపై తక్కువ ధరకే ఎక్కువ ఛానెల్స్ చూసే అవకాశం కల్పించనుంది ట్రాయ్. ఇందులో భాగంగా టెలిఫోన్ రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా న్యూ టారిఫ్ ( TRAI ) ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త టారీఫ్ వల్ల వినియోగదారులపై భారం తగ్గనుంది. ఆగస్టు 10లోపు ఈ మార్పులు అమలులోకి రానున్నాయి. ( Read Also :Memes On Sonu Sood: సోనూ సూద్ పై వస్తున్న టాప్  మీమ్స్  ఇవే )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

200 ఛానెల్స్....
వినియోగదారులు కేవలం రూ. 130  చెల్లించి 200 ఛానెల్స్ చూడవచ్చు.
ప్రస్తుతం రూ.130 చెల్లిస్తే కేవలం 100 ఛానెల్స్ చూసే అవకాశం మాత్రమే ఉంది.


గరిష్ట ధర తగింది..
ప్రస్తుతం ఒక ఛానెల్ గరిష్ట ధర రూ.19గా ఉంది. దాన్ని త్వరలో రూ.12 చేయనున్నారు. దీంతో వినియోగదారులపై భారం తగ్గనుంది. అంటే ఇకపై రూ.12 కన్నా ఎక్కువగా చెల్లించే అవసరం ఉండదు.


త్వరలో విడుదల..
ఈ మార్పులతో ఉన్న కొత్త టారీఫ్ ( New Tarrif ) ను ఆగస్టు 10 నాటికి విడుదల చేయాలని ట్రాయ్ సన్నాహాలు చేస్తోంది.


బ్రాడ్ క్యాస్టర్లలో ఆందోళన..
ట్రాయ్ కొత్త నిర్ణయంతో బ్రాడ్ క్యాస్టర్లలో ( Broadcasters ) ఆందోళన పెరిగింది. గత సంవత్సరం అంటే 2019 లోనే ట్రాయ్ తన ట్యారీఫ్ 1.0 ను అమలు చేసింది. అంతలోనే 2.0 రానుంది. అయితే ఈ మార్పు వినియోగదారులకు మాత్రం ఊరట కలిగించే విషయం.


Read This Story Also : Railway Video: ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన రైల్వే సెక్యూరిటీ.. వీడియో