ఉత్తర భారత దేశంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఉదయం పూట జనం బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. తీవ్రంగా చలి పంజా విసురుతుండడం.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో విజుబులిటీ పూర్తిగా తగ్గిపోయింది. పొగ మంచు కారణంగా 5, 6 మీటర్ల తర్వాత ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది.  విజుబులిటీ పడిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఉదయం 8 గంటలకు కూడా వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
మరోవైపు పొగ మంచు భారీగా ఉండడంతో  రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి దాదాపు 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒక్కో రైలు దాదాపు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో ఈ పరిస్థితి నెలకొంది. చెన్నై- నిజాముద్దీన్ దురంతో ఎక్స్ ప్రెస్, పూరీ-న్యూఢిల్లీ పురుషోత్తమ్ ఎక్స్ ప్రెస్, వారణాసి- న్యూఢిల్లీ కాశీవిశ్వనాథ్ ఎక్స్ ప్రెస్, రేవా- ఆనంద్ విహార్ రేవా ఎక్స్ ప్రెస్, హౌరా- న్యూఢిల్లీ పూర్వా ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు ప్రకటించారు. [[{"fid":"181256","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: దట్టంగా పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు


ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 
దేశ రాజధాని ఢిల్లీలో చలి పులి పంజా విసురుతోంది. దీంతో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న (సోమవారం) 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా .. ఈ రోజు ఉదయం పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఇవాళ ఉదయం ఢిల్లీలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. రోజులో అధిక ఉష్ణోగ్రత 16 డిగ్రీలకు మించడం లేదు. రేపు కూడా పొగ మంచు ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..