Udaipur Murder Updates :  దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఉదయ్ పూర్ టైలర్ దారుణ హత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఇద్దరు దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన టైలర్ కన్హయ్య లాల్ సాహుకు 5 రోజుల క్రితం భయంకరమైన బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. తనకు వచ్చిన బెదిరింపులపై స్థానిక పోలీసులకు కన్హయ్య లాల్ ఫిర్యాదు చేశాడు. భయంతో ఐదు రోజుల పాటు షాపు కూడా తెరవలేదు. అయితే రక్షణ కల్పించాలని కన్హయ్య లాల్ కోరినా ... పోలీసులు పట్టించుకోలేదు. ఇంతలోనే దారుణం జరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందిస్తే ఈ దారుణం జరిగేది కాదని చెబుతున్నారు. కన్హయ్య లాల్ రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదన్న అంశం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఇప్పటికే పోలీసుల వైఫల్యం వల్లే దుండగులు టైలర్ ను దారుణంగా హత్య చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం పట్టపగలే దారుణం జరిగింది. ధన్‌ మండీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ టైలర్‌ను ఇద్దరు దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. టైలర్ షాపులోకి చొరబడ్డారు ఇద్దరు దుండగులు. ఒక దుండగుడు కన్హయ్య లాల్ పై కత్తితో దాడి చేయగా.. మరో దుండగుడు ఆ ఘటనను తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. పదునైన కత్తితో తల నరకడంతో టైలర్ స్పాట్ లోనే చనిపోయాడు. తర్వాత ఇద్దరు దుండగులు తామే హత్య చేశామంటూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్ గా మారింది. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య జరిగిన పోస్టుల వివాదంతోనే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది. టైలర్ హత్య ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు పాల్పడిన నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.


కన్హయ్య లాల్ హత్యతో ఉదయ్ పూర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. షాపులన్ని మూతపడ్డాయి. జనాలు రోడ్డు మీదకు రావాలంటేనే జంకుతున్నారు. దుండగులను అరెస్ట్ చేయాలంటూ స్థానిక వ్యాపారులు ధర్నాకు దిగడంతో మంగళవారం రాత్రి ఉద్రిక్తత తలెత్తింది. ఉదయ్ పూర్ లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రాజస్థాన్ లో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. ఉదయ్ పూర్ లో కర్ఫ్యూ విధించారు. రాజస్థాన్ మొత్తం 144 సెక్షన్ విధించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంయమనం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Read also: Udaipur Killing: ఇండియాలోనూ హిందువులకు రక్షణ లేదు.. ఉదయ్‌పూర్ దర్జీ హత్యపై రచయిత్రి తస్లీమా నస్రీన్ రియాక్షన్..


Read also: Udaipur Murder Updates: ఉదయ్ పూర్ హత్య ఘటనతో దేశమంతా హై అలర్ట్..దోషులను శిక్షించాలన్న రాహుల్ గాంధీ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి