Kerala Gold scam: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో కేసుకు సంబంధం
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కల్గించింది. ఈ కేసు దర్యాప్తుల్లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్ ఐ ఏ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో ఆశ్చర్యపోయే విషయాలున్నాయి.
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ( Kerala Gold smuggling case ) దేశవ్యాప్తంగా సంచలనం కల్గించింది. ఈ కేసు దర్యాప్తుల్లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్ ఐ ఏ ( NIA ) ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో ఆశ్చర్యపోయే విషయాలున్నాయి.
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ఎయిర్ పోర్టు ( Tiruvanantapuram Airport ) లో జూలై నెలలో 30 కిలోల బంగారం అక్రమంగా సరఫరా చేస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో పెద్ద పెద్ద వ్యక్తులు, రాజకీయనేతల పాత్రపై అభియోగాలు రావడమే కాకుండా...ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ( Cm's Principal secretary ) పై ఆరోపణలొచ్చాయి. ఈ కేసును ఈడీ ( ED ) తో పాుట ఎన్ ఐ ఏ విచారిస్తోంది. ఈడీ ఇప్పటికే 303 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శివశంకర్ పాత్రపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఆగస్టు 12, 15న శివ శంకర్ స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది.
మరోవైపు కర్నాటక ( Karnataka ) లో కలకలం రేపుతున్న డ్రగ్స్ మాఫియా వ్యవహారానికి కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కు సంబంధం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ సంగతిని స్వయంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( Narcotics control bureau ) లోని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. బెంగుళూరు మాదకద్రవ్యాల కేసులో కీలక నిందితుడైన డ్రగ్ పెడ్లర్ మహ్మద్ అనూప్, కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితుడైన కె టి రమీస్ మధ్య జరిగిన సంభాషణలే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది.
ఇప్పుడు ఇదే కేసులో ఎన్ ఐ ఐ చేసిన దర్యాప్తులో సైతం ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా NIA ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో కీలకాంశాలున్నాయి. ఈ కేసుతో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధాలున్నాయన్న ఆరోపణల్ని నిజం చేస్తూ ఎన్ ఐ ఐ నివేదికలో పలు అంశాలున్నట్టు సమాచారం.
అంతేకాకుండా 1993 వరుస పేలుళ్లతో ముంబైను గడగడలాడించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ( Underworld Don Daud Ibrahim ) పేరును.. ఈ కేసులో అధికారులు ప్రస్తావించారు. ప్రదాన నిందితునికి, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని అనుమానాలు వ్యక్తంచేశారు. అంటే ఎన్ ఐ ఏ నివేదిక ప్రకారం స్మగుల్ గోల్డ్ నిధులు దావూద్ ఖాతాలోకి చేరుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి మొదట్నించీ సంచలనంగా మారిన ఈ కేసులో NIA నివేదికతో ప్రకంపనలు మొదలయ్యాయి. Also read: Sabarimala temple: అయ్యప్ప భక్తులకు ముఖ్య గమనిక