Free Ration Scheme: దేశంలో అమల్లో ఉన్న ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన అప్‌డేట్ వెలువరించింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా 80 కోట్లమందికి ప్రయోజనం కలగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఇక వచ్చే సంవత్సరం మార్చ్, ఏప్రిల్ నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రదాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. కరోనా సమయంలో  అందుబాటులో తీసుకొచ్చిన ఉచిత రేషన్ పథకమైన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజను మరో ఐదేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలో 80 కోట్లమందికి ప్రయోజనం కలగనుంది. 


ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన మరో ఐదేళ్లు కొనసాగించేందుకు 11.8 లక్షల కోట్లు ఖర్చు కానున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూల్ తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో 2020లో ప్రారంభమైన ఈ పధకం మరో ఐదేళ్లు కొనసాగనుంది. ఈ పధకం పొడిగింపు 2024, జనవరి 1 నుంచి వర్తించనుంది. అంటే 2028 డిసెంబర్ వరకూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది. ఈ పధకం కింద నెలకు మనిషికి 5 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. తొలుత మూడు నెలలకోసం ప్రారంభించిన పథకాన్ని ఆ తరువాత పొడిగిస్తూ వచ్చారు. 


మరోవైపు దేశవ్యాప్తంగా 15 వేలమంది మహిళా స్వయం సహాయక బృందాలకు ద్రోన్లు అందించాలని కేబినెట్‌లో నిర్ణయించినట్టు మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ప్రయోజనాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే దీనివెనుక లక్ష్యమన్నారు. ఈ పధకాన్ని రెండేళ్లపాటు కొనసాగిస్తామని, ద్రోన్ల కొనుగోలులో 80 శాతం వరకూ ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు. మిగిలిన మొత్తాన్ని రుణంగా తీసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. 


Also read: ATM New Rules: ఏటీఎం యూజర్లకు అలర్ట్, డబ్బులు రాకుండానే ఎక్కౌంట్‌లో కట్ అయితే ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook