ATM New Rules: ఏటీఎం యూజర్లకు అలర్ట్, డబ్బులు రాకుండానే ఎక్కౌంట్‌లో కట్ అయితే ఏం చేయాలి

ATM New Rules: రోజువారీ దైనందిన జీవితంలో వివిధ పనులకు సంబంధించి మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. తాజాగా ఆర్బీఐ ఏటీఎం యూజర్లకు అలర్ట్ జారీ చేసింది. ఏటీఎం కార్డు విషయంలో కొత్త నిబంధనలు వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 30, 2023, 02:55 PM IST
ATM New Rules: ఏటీఎం యూజర్లకు అలర్ట్, డబ్బులు రాకుండానే ఎక్కౌంట్‌లో కట్ అయితే ఏం చేయాలి

ATM New Rules: ఏటీఎం కార్డు వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి ఏటీఎం కార్డు ఇన్‌సర్ట్ చేసి పిన్ ఎంటర్ చేశాక డబ్బులు రాకుండానే ఎక్కౌంట్‌లోంచి డిడక్ట్ అయితే ఏం చేయాలనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. ఆర్బీఐ దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు జారీ చేసింది.

దేశంలో డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగినా సరే ఇంకా కొన్ని ప్రత్యేక అవసరాలకు ఏటీఎం వినియోగం జరుగుతూనే ఉంది. ఏటీఎం కార్డు అనేది చాలా సందర్భాల్లో ఉపయోగకరమే కానీ ఒక్కోసారి ఇబ్బందుల్లో నెట్టుతుంటుంది. డబ్బులు విత్‌డ్రా చేసేటప్పుడు డబ్బులు రాకుండానే ఎక్కౌంట్‌లోంచి డబ్బులు కట్ అయిపోతుంటాయి. ఇలా జరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల్లో లేదా కొన్ని గంటల్లోనే కట్ అయిన డబ్బులు తిరిగి రిటర్న్ అవుతాయి. 

ఏటీఎంలో అన్ని వివరాలు నమోదు చేశాక డబ్బులు రాకుండా ఎక్కౌంట్‌లో డబ్బులు డిడక్ట్ అయితే అది కచ్చితంగా సాంకేతిక కారణమై ఉంటుంది. చాలా సందర్భాల్లో ఏటీఎం మెషీన్ స్టక్ అవడం వల్ల కస్టమర్‌కు డబ్బుల అందవు. ఇలాంటి కేసుల్లో డబ్బులు రిటర్న్ అయ్యేందుకు ఆర్బీఐ 5 రోజుల కాలవ్యవధి నిర్ణయించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కట్ అయిన డబ్బులు తిరిగి 5 రోజుల్లోగా సంబంధిత ఎక్కౌంట్‌కు రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అలా జరగకపోతే రోజుకు 100 రూపాయల చొప్పున బ్యాంక్ కస్టమర్‌కు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇదే పరిస్థితి ఎదురైతే ఆర్బీఐ మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం వెంటనే సమీపంలోని సంబంధిత బ్యాంకుకు వెళ్లి సమాచారం అందించాలి. లేదా బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించించవచ్చు. మీ ఫిర్యాదును బ్యాంకు రిజిస్టర్ చేసి పరిశీలిస్తుంది. 

మీ ఫిర్యాదు నిజమని తేలితే మీ డబ్బులు 5-6 రోజుల్లోగా రిటర్న్ అవుతాయి. ఈలోగా మీరు మీ ఏటీఎం స్లిప్, మెస్సేజ్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏటీఎం లావాదేవీ జరిపినట్టు రుజువు అదే అవుతుంది. 

మీ డబ్బులు మీ ఎక్కౌంట్‌కు 30 రోజుల్లోగా రిటర్న్ అవకపోతే బ్యాంక్ గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేయాలి. 

Also read: Telangana Election 2023 Update: ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం, ఎన్ని గంటలకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News