ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దు: కిషన్ రెడ్డి
మార్చ్ 16 నుంచి కర్తార్ పూర్ కారిడార్‌ను సైతం మూసివేశాం. పొరుగు దేశాల నుంచి భూభాగం ద్వారా ఇతర దేశాల నుంచి ప్రయాణికులను చెకింగ్ చేయడానికి చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కేవలం 20 కేంద్రాలగుండా మాత్రమే వచ్చేలా అనుమతి ఇచ్చామని’ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి (CoronaVirus) నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ఆధారంగా సోషల్ అబ్వర్వేషన్ ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల అధికారులను ఆదేశించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ కేసుల వ్యాప్తి, వాటిపై తీసుకుంటున్న చర్యలపై ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కరోనా పరీక్షల కోసం ప్రజలు ఒక్క రూపాయి కూడా చెల్లించన్కర్లేదని, ఉచితంగానే టెస్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించి జనవరి 22 నుంచి ఇప్పటివరకూ క్యాబినెట్ సెక్రటరీ రక్షణ, ఫార్మా, కామర్స్, టెక్స్ టైల్స్ తదితర శాఖలతో 22 సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్షించినట్లు చెప్పారు. గతంలో పాజిటీవ్‌గా తేలిన పేషెంట్లను నెగటీవ్ ఫలితం వచ్చాక నిర్ధారించుకుని హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జ్ చేయాలని వైద్యులకు మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. పది లక్షల కిట్స్‌కు ఆర్డరిచ్చినట్లు పేర్కొన్నారు.
జనతా కర్ఫ్యూపై ప్రధాని మోదీ కీలక ప్రకటన..
‘అన్ని రాష్ట్రాల ఆరోగ్యకార్యదర్శులతో ప్రభుత్వం 16 సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తున్నాం. డీజీహెచ్ఎస్ ఆధ్వర్వంలో టెక్నికల్ పర్యవేక్షణకు సంబంధించి సమావేశాలు నిర్వహించాం. అన్ని రాష్ట్రాల మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో సైతం ప్రభుత్వం ఆరోగ్యశాఖమంత్రి ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 10, మార్చి5న కరోనా పరిస్థితిపై పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. వివిధ రాష్ట్రాలు కరోనాకు సంబంధించి సవాళ్లను ఎదుర్కోవడానికి, అక్కడ ఏర్పాటు చేస్తున్న పనులను సమీక్షించడానికి గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకు జాయింట్ సెక్రటరీలను పర్మినెంట్‌గా డెప్యూట్ చేశాం.
‘పారాసిటమల్’పై వైఎస్ సునీతారెడ్డి ఏమన్నారంటే!
కేంద్ర ప్రభుత్వానికి సంబంధి హెల్త్ టీమ్స్ జనవరి 25నుంచి అన్నివిమానాశ్రయాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. చైనా, బంగ్లాదేశ్, నేపాల్‌తో సరిహద్దులో ఉన్న జిల్లాలు, గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి వారికి అవగాహన కల్పించాం. మీరు విదేశాలకు వెళ్లవద్దని, విదేశీయులను వారి ప్రాంతంలోకి రానివ్వకుండా చూసుకోవాలని సూచించాం. మార్చ్ 16 నుంచి కర్తార్ పూర్ కారిడార్‌ను సైతం మూసివేశాం. పొరుగు దేశాల నుంచి భూభాగం ద్వారా ఇతర దేశాల నుంచి ప్రయాణికులను చెకింగ్ చేయడానికి చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కేవలం 20 కేంద్రాలగుండా మాత్రమే వచ్చేలా అనుమతి ఇచ్చామని’ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యాంటీ బయాటిక్స్‌తో కరోనాకు చెక్ పెట్టవచ్చా?
వైరల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా విదేశాల్లో ఉన్న రాయబారుల సాయంతో విదేశాల్లో తీసుకుంటున్న అత్యున్నత చర్యలు, విధానాలను ప్రభుత్వం తెలుసుకుని పాటించేందుకు టీమ్స్ ఏర్పాటు చేశాం. విదేశీ ప్రయాణికుల పర్యవేక్షణకు 28 రోజులపాటు అన్ని జిల్లాల కలెక్టర్లను పంపించాం. రక్త నమునాలు ఎలా సేకరించాలి, ఏ విధంగా వాటిని పరీక్షలకు పంపించాలన్న దానిపై అవగాహన కల్పించాం. ఓడ మార్గాలలో భారత్‌కు రాకుండా నౌకాశ్రయ అధికారులను అప్రమత్తం చేశాం. దేశంలో 65 స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారి అవసరమయ్యే అధికారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..