హైదరాబాద్: అన్‌లాక్ 4 మార్గదర్శకాలులో భాగంగా ఇటీవలే మెట్రో రైలు సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం.. ఇవాళ అందుకు సంబంధించిన స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసిజర్ నియమావళిని విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన అన్‌లాక్ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 7 నుంచి 12వ తేదీలోగా విడతల వారీగా గ్రేడెడ్ పద్ధతిలో దేశంలోని అన్ని మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) నేపథ్యంలో మెట్రో రైళ్లలో కొవిడ్-19 నియంత్రించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ మేరకు తాజా ఆదేశాలు జారీచేశారు. కేంద్రం సూచించిన Standard operating procedures (SOPs) నియమాలు ఇలా ఉన్నాయి. Also read : Unlock 4 Guidelines: హైదరాబాద్ మెట్రో రైలు పట్టాలెక్కే రోజు


  • ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ ( Thermal screening ) నిర్వహించిన అనంతరం లక్షణాలు ( Asymptomatic passengers ) లేనివారినే మెట్రో రైలు స్టేషన్‌లోకి అనుమతించాలి. 

  • సోషల్ డిస్టన్సింగ్ ( Social distancing ) లక్ష్యం దెబ్బతినకుండా మెట్రో స్టేషన్ పరిసరాల్లో, మెట్రో రైలులో ( Metro rail ) మార్కింగ్ చేసిన గుర్తులపైనే నిలబడాల్సి ఉంటుంది.

  • ప్రయాణికులతో పాటు మెట్రో రైలు సిబ్బంది మాస్కులు ధరించడం ( Mask wearing ) తప్పనిసరి. మాస్కులు లేకుండా వచ్చే వారు మెట్రో స్టేషన్స్‌లో మాస్కులు కొనుగోలు చేసేలా మాస్కులు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలి.

  • ప్రయాణికులకు ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌పై ( Aarogya setu app ) అవగాహన కల్పిస్తూ ఆరోగ్య సేతు యాప్ వినియోగించేలా ప్రోత్సహించాలి.

  • మెట్రో రైలు స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులకు ప్రవేశద్వారం వద్దే శానిటైజర్ ( Sanitizers ) అందుబాటులో ఉండాలి.

  • మెట్రో రైలుతో పాటు స్టేషన్‌లోని కౌంటర్స్, టాయిలెట్స్, లిఫ్ట్ వంటి అన్ని పరిసరాలను నిర్వాహకులు ఎప్పటికప్పుడు శానిటైజ్ ( Sanitization ) చేయాలి.

  • స్మార్డ్ కార్డు / క్యాష్‌లెస్ / ఆన్‌లైన్ టికెట్ ( smart card / cashless / Online transactions ) కొనుగోలు పద్ధతులను ప్రోత్సహించాలి. టోకెన్స్ / పేపర్ స్లిప్స్ / టికెట్స్‌ను శానిటైజ్ చేయాలి.

  • రైలు స్టేషన్‌లో వచ్చి ఆగినప్పుడు రైలు ఎక్కి, దిగే ప్రయాణికుల మధ్య తోపులాట లేకుండా తగినంత సమయం రైలు ఆగేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. Also read : Unlock 4 Guidelines: సిటీ బస్సులు పరిస్థితేంటి ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్, ఢిల్లీ, నొయిడా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, జైపూర్, కోల్‌కతా, గుజరాత్, లక్నో మెట్రో సేవల విషయంలో కేంద్రం విధించిన పై నిబంధనల మేరకే వారివారి సొంత నిబంధనలను రూపొందించుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. 


మహారాష్ట్రలో కొవిడ్-19 ( COVID-19 in Maharashtra ) విజృంభిస్తున్నందున అక్కడి మెట్రో సేవలు అక్టోబర్ 20 తర్వాతే అందుబాటులోకి రానున్నట్టు కేంద్రం తెలిపింది. Also read : TS EAMCET: రెండు సెషన్స్‌లో ఎంసెట్ పరీక్ష.. రేపటి నుంచి అందుబాటులో హాల్‌టికెట్లు