UP Assembly Elections 2022: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ యూపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ (Congress)  పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర ముఖ్యనేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్​పీఎన్​ సింగ్ (RPN Singh)​.. కాంగ్రెస్​కు గుడ్​బై చెప్పారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి (Sonia Gandhi) రాజీనామా లేఖను పంపారు. దేశానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన రాజీనామా లేఖను ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ...''‘నా రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నా'’ అని ఆర్‌పీఎన్‌ సింగ్‌ (former Union minister Ratanjit Pratap Narain Singh) రాసుకొచ్చారు. దీంతో ఆయన భాజపాలో (BJP) చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్​పీఎన్​ సింగ్​.. ఝార్ఖండ్​లో కాంగ్రెస్​ వ్యవహారాల బాధ్యులుగా ఉన్నారు. 



Also Read: UP Elections 2022: 159 మందితో ఎస్పీ తొలి జాబితా విడుదల..కర్హల్‌ నుంచి బరిలోకి దిగుతున్న అఖిలేష్..


అందుకే పార్టీని వీడారా?
సింగ్​..కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత నమ్మకస్థుడు. కుషీనగర్ (Kushinagar)​ నుంచి గతంలో ఎంపీగా సేవలందించారు.  1996-2009 మధ్య ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఏఐసీసీ సెక్రటరీగానూ బాధ్యతలు నిర్వహించారు. ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో తన సన్నిహితులకు టికెట్​ నిరాకరించడమే.. సింగ్​ పార్టీని వీడేందుకు కారణంగా తెలుస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్​ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


Twitter , Facebook.మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి