UP Elections 2022: 159 మందితో ఎస్పీ తొలి జాబితా విడుదల..కర్హల్‌ నుంచి బరిలోకి దిగుతున్న అఖిలేష్..

UP Polls 2022:  ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది సమాజ్​వాదీ పార్టీ. 159 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2022, 08:52 AM IST
  • ఎస్పీ తొలి జాబితా విడుదల
  • కర్హల్‌ నుంచి అఖిలేష్‌ పోటీ..
  • ప్రస్తుతం ఆజంఘఢ్‌ నుంచి ఎంపీగా ఉన్న ఎస్పీ అధినేత
UP Elections 2022:  159 మందితో ఎస్పీ తొలి జాబితా విడుదల..కర్హల్‌ నుంచి బరిలోకి దిగుతున్న అఖిలేష్..

UP Elections 2022:  ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (UP Polls 2022) తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) బరిలో దిగనున్నారు. మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్‌ (Karhal) నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. తాజాగా 159 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది సమాజ్​వాదీ పార్టీ.  అలాగే.. జైలుకు వెళ్లిన నేత అజామ్​ ఖాన్ ( Azam Khan)​ రామ్​పుర్​ నుంచి, పార్టీ ఎమ్మెల్యే నహిద్​ హసన్​ కైరాన్​ నుంచి పోటీ చేస్తున్నారు.

కర్హల్‌..యాదవులకు కంచుకోట. ఇది మాజీ సీఎం ములాయంసింగ్‌ యాదవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది. 2002 ఎన్నికల్లో మినహా 1993 నుంచి కర్హల్‌లో సమాజ్‌వాదీ (Samajwadi Party) జెండా ఎగురుతోంది. 2017లో ఎస్పీ అభ్యర్థి సోబ్రాన్‌సింగ్‌ యాదవ్‌ 38 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. పార్టీకి బలమైన స్థానం కావడంతో అఖిలేశ్‌ సైతం ఇక్కడి నుంచే పోటీకి మొగ్గు చూపారు.

Also Read: UP elections 2022: ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీకి బిగ్ షాక్‌.. బీజేపీలో చేరిన ములాయం కోడలు..

ఇటీవల సమాజ్​వాదీలో చేరిన రాష్ట్ర మాజీ మంత్రి ధరమ్​ సింగ్​ సైనీకి సహరాన్​పుర్​ జిల్లాలోని సకుర్​ నియోజకవర్గాన్ని కేటాయించారు అఖిలేశ్​. అజామ్​ ఖాన్​ కుమారుడు అబ్దుల్లా అజామ్​కు (Abdullah Azam) సువార్​ తాండా టికెట్​ ఇచ్చారు. పార్టీ సీనియర్​ నేత శివపాల్​ యాదవ్​కు తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఇతవాహ్​ జిల్లాలోని జశ్వంత్​నగర్​ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీలోని 403 నియోజకవర్గాలకు ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. మార్చి 10 ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News