లక్నో: ఇప్పటికే అలాహాబాద్ ను ప్రయాగ్ రాజ్ గాను.. ఫైజాబాద్ జిల్లాను అయోధ్య మార్చిన యోగి సర్కార్ ... మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పుణ్యక్షేత్రాలైన అయోధ్య, మధురలో మద్యం, మాసం విక్రయాలపై నిషేధం విధించేందుకు స్కెచ్ రెడీ చేసింది. అలాగే అయోధ్యలో 14 కోసి పరిక్రామార్గ్, మధురలోని శ్రీకృష్ణుని జన్మస్థలాన్ని యాత్రికుల కేంద్రంగా ప్రకటించాలని భావిస్తోంది.  స్థానికుల డిమాండ్ మేరకు  అయోధ్య ( ఫైజాబాద్ ) జిల్లాలో  మద్యం, మాసం అమ్మకాలపై నిషేధం విధించే అంశంపై యూపీ సర్కార్ కసరత్తు చేస్తుంది. న్యాయపరంగా ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి దీన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి శ్రీకాంత్ శర్మ కూడా ధృవీకరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చట్టప్రకారమే అమలు - మంత్రి శ్రీకాంత్ శర్మ


ఈ సందర్బంగా మంత్రి శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ మద్యం, మాసం అమ్మకాలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని.. వాటి నిషేదం చట్టపరిధిలోనే ఉంటుందన్నారు. చట్టప్రకారమే వాటిపై నిషేధం అమలవుతుందని తెలిపారు. అలాగే అయోధ్యలోని 14 కోసి పరికారా మార్గ్ చుట్టూ ఉన్న ప్రాంతంతోపాటు మధురలో శ్రీకృష్ణ జన్మస్థలాన్ని యాత్రికుల కేంద్రంగా ప్రకటించటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిందన్నారు . ఇప్పటికే గోవర్ధన్ పరిధిలోని వ్రిందావన్, బర్సానా, నంద్ గావ్, గిరిరాజ్, సప్త కోసి పరిక్రమా ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా గుర్తించామని అక్కడ మాంసాహారం, మద్యం అమ్మడంపై నిషేధం కొనసాగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


నిషేధంతో నష్టమేం లేదు - ఆచార్య సత్యేంద్ర


ఈ అంశంపై ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందిస్తూ అయోధ్య అత్యంత పవిత్రమైన స్థలమని, అక్కడ మాసం,మద్యం విక్రయించడం సరైంది కాదన్నారు . వీటిని నిషేధించడం వల్ల ప్రజలకు జరిగే నష్టం ఏమీ ఉండదని..పైగా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ప్రభుత్వ చర్యను సమర్థించారు. ఆయోధ్య ఎన్నో శతాబ్ధాలుగా పవిత్రమైన ప్రాంతంగా ఉందని.. ఫైజాబాద్ గా మార్చిన తర్వాతే మార్పులు జరిగాయన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫైజాబాద్ ను మళ్లీ అయోధ్యగా మార్చిందని దాంతో పాటు ఇక్కడ మద్యం, మాంసంపై విక్రయాలపైనా నిషేధం వర్తించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.