Bijnor Gangrape: ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో 20 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చిన ఆమె స్నేహితులు.. యువతి మత్తులో ఉన్నప్పుడు ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందుతుల్ని అదుపులోకి పోలీసులు తమదైన శైలీలో విచారిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారు ఉమర్, అబ్దుల్ గా గుర్తించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.


ఎలా జరిగిందంటే? 


ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబరు 19న మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన నిందితుడు ఉమర్.. తన స్నేహితురాలిని ఫోన్ చేసి హాస్టల్ దగ్గరకు రమ్మని ఒప్పించాడు. 


ఆ తర్వాత నిందితుడి సోదరి పుట్టినరోజు జరుపుకొనేందుకు వేరే ఊరు వెళ్లేందుకు ఉమర్.. ఆ యువతిని ఒప్పించాడు. దాంతో ఆమెను కారులో కూర్చొమని చెప్పాడు ఉమర్. అయితే అప్పటికే ఆ కారులో అబ్దుల్ అనే వ్యక్తి ఉన్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కారుతో సహా అక్కడి నుంచి వెళ్లిన ఆ ముగ్గరూ.. సన్ హేరి అనే హోటల్ కు చేరుకున్నారు. పథకం ప్రకారం ఆ యువతిని హోటల్ గదికి తీసుకొచ్చిన ఉమర్, అబ్దుల్.. ఆమెకు మత్తుమందు కలిపిన శీతల పానీయాన్ని ఇచ్చారు. దాన్ని తాగి ఆమె అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత.. ఆ యువతిపై నిందితులిద్దరూ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. 


ఈ విషయాన్ని పోలీసులకు లేదా కుటుంబసభ్యులకు చెబితే చంపేస్తామని బెదింరించినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే తనపై అత్యాచారం చేయడం సహా ఆ దారుణాన్ని వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఆ వీడియోను ఇంటర్నెట్ లో రిలీజ్ చేయకుండా ఉండేందుకు ఆ యువతి నుంచి రూ.10 వేలను నిందితులు డిమాండ్ చేసినట్లు బాధితురాలు పేర్కొంది. దీంతో తన స్నేహితుడి ద్వారా ఆమె రూ.8 వేలు చెల్లించినట్లు చెప్పింది. 


బాధితురాలి ఫిర్యాదు మేరకు.. నిందితులిద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దర్ని ఉమర్, అబ్దుల్ గా గుర్తించారు. ఆ ఇద్దరు నిందితులపై IPC సెక్షన్లు 366, 328, 376(D), 323, 506.. SC/ST చట్టంలోని సెక్షన్ 3 (2)(v) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  


Also Read: Uttar Pradesh: పర్ఫ్యూమ్‌ వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.150 కోట్లు స్వాధీనం!


Also Read: Omicron cases in India: దేశంలో ఒమిక్రాన్ విజృంభణ- మొత్తం కేసులు @ 358


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి