H1-B Visa: భారతీయులకు గుడ్‌న్యూస్, జనవరి నుంచి హెచ్ 1బి వీసా రెన్యువల్ ప్రారంభం
H1-B Visa: భారతీయులకు అగ్రరాజ్యం అమెరికా శుభవార్త అందిస్తోంది. అమెరికాలో ఉద్యోగం చేసే భారతీయులకు ప్రయోజనం కలగనుంది. హెచ్ 1 బి వీసా రెన్యువల్స్ ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
H1-B Visa: అమెరికాలోని భారత ఉద్యోగులకు గుడ్‌న్యూస్. భారతీయల హెచ్ 1 బీ వీసాలు, హెచ్ 1 బీ స్పెషల్ బిజినెస్ వీసాల రెన్యువల్‌కు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి హెచ్1 బీ వీసాల రెన్యువల్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ నెలలో అమెరికా పర్యటన సందర్భంగా పైలట్ ప్రోగ్రాం ప్రారంభించారు. హెచ్ 1 బి వీసాల్లో కొన్ని కేటగరీల రెన్యువల్ కోసం ఉద్దేశించిన కార్కక్రమమిది. అమెరికా వెళ్లేందుకు ఎదురౌతున్న వెయిటింగ్ సమయం తగ్గించేందుకు ఈ ప్రాజెక్టులో కొన్ని చర్చలు తీసుకున్నారు. ఇందులో భాగంగా హెచ్ 1 బీ వీసా హోల్డర్లు తమ వీసాలను అవసరమైన డాక్యుమెంట్లు మెయిల్ చేయడం ద్వారా రెన్యువల్ చేసుకోవచ్చు.
అమెరికాలో నివసించేవారికి ఈ నిర్ణయం ద్వారా గొప్ప మార్పు ఉంటుందని అమెరికా కన్స్యూలర్ ఎఫైర్స్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ట్ వెల్లడించారు. గతంలో అయితే అమెరికా వదిలి వెళ్లిపోవల్సి వచ్చేది. ఇప్పుడీ పైలట్ ప్రాజెక్టు ద్వారా ముందే రెన్యువల్ కు అప్లై చేసుకోవచ్చు.
వీసాల బ్యాక్‌లాగ్ కారణంగా చాలామంది హెచ్ 1 బీ సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. ముఖ్యంగా సమీపంలోని ఇతర దేశాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. డొమెస్టిక్ రెన్యువల్ ఆప్షన్‌తో కన్స్యూలర్ ఆఫీసులకే కాకుండా ఇండియాలో కూడా ప్రయోజనం కలగనుంది. యూఎస్ వెళ్లేందుకు సరాసరి వెయిటింగ్ సమయం గత ఏడాది 130 రోజులకు తగ్గించడమైంది. 2022 ఆర్ధిక సంవత్సరంలో గణనీయంగా 70 రోజులు తగ్గాయి. ఈ వెయిటింగ్ సమయాన్ని 90 రోజులకు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
యూఎస్ ఎంబసీ అక్టోబర్ 2022 నుంచి 1,40 వేల మందికి స్టూడెంట్ వీసాలు జారీ చేసింది. అంతర్జాతీయ విద్యార్ధుల్లో ఈ వృద్ధి యూఎస్ ఎకానమీపై ఏడాదికి 38 బిలియన్ డాలర్లతో గణనీయ ప్రభావం చూపించింది. 2023 జూన్-ఆగస్టు మధ్య కాలంలో యూఎస్‌కు వెళ్లిన విద్యార్ధుల సంఖ్య చైనాను దాటేసింది. హెచ్ 1 బి వీసా ప్రక్రియను సులభతరం చేస్తూ అంతర్జాతీయ విద్యార్ధులకు సపోర్ట్ చేస్తున్న అమెరికా చర్యలు భారతీయ ఉద్యోగులు, విద్యార్ధుల యూఎస్ అవకాశాల్ని పెంచుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook