సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శాస్త్ర, సాంకేతికలో ప్రాంతీయ భాషలను ఉపయోగించాలని..  శాస్తవేత్తలు యువతలో సైన్స్ పై ఇష్టాన్ని, ప్రేమను పెంపొందించాలని కోరారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోల్కతాలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ 125వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలో ప్రసంగిస్తూ "బోస్ బహుభాషా కోవిదులు. ఆయన సైన్స్ పాఠాలను ప్రాంతీయ భాషల్లోనే బోధించేవారు. బెంగాలీ సైన్స్ మ్యాగజైన్ ను ప్రారంభించారు" అన్నారు. 


"యువతలో సైన్స్ పట్ల అవగాహన, ప్రేమను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. ఈ మార్గంలో విజయం సాధించాలంటే భాష అవరోధం కాకూడదు" అన్నారు. నేటి జీవితంలో సాధారణ ప్రజలకు సహాయం చేయడానికి వారి ప్రాథమిక జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని శాస్త్రవేత్తలను కూడా ప్రధానమంత్రి కోరారు.


"మీ ఆవిష్కరణల ద్వారా, పేదల జీవితం సులభమవుతున్నాయా? మధ్యతరగతి సమస్యలను తగ్గించగలుగుతున్నామా?" అని ప్రశ్నించుకోవాలని అన్నారు. దేశంలో ఎదుర్కొంటున్న సాంఘిక-ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని పరిశోధనలు జరపాలని శాస్త్రవేత్తలను కోరారు.


1894, జనవరి 1న జన్మించిన భౌతిక శాస్త్రవేత్త బోస్ 1920 ప్రారంభంలో క్వాంటం మెకానిక్స్ పై పరిశోధనలు చేసి ప్రసిద్ధి చెందారు. బోస్ బోసోన్స్ అంటే ఏమిటి అనేది కనుగొన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తో కలిసి పరిశోధనలు కూడా చేశారు.