Uttar Pradesh Elections 2022: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్తరప్రదేశ్ తొలిదశ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 7 దశల్లో జరగనున్నాయి. 7 దశల్లో ఎన్నికలు జరగనున్న దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌పైనే అందరి ఆసక్తి నెలకొంది. ఇవాళ జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. తొలిదశలో యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. తొలిదశలో ఇవాళ ముజఫర్‌నగర్, ఘజియాబాద్, మీరట్, షామ్లి, బాగ్‌పత్, గౌతమ్‌బుద్ధ్ నగర్, హాపూర్, బులంద్ షహర్, అలీఘర్, మధుర, ఆగ్రాల్లో పోలింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్ స్కానర్లు, హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేశారు. సిబ్బంది కోసం అవసరమైన గ్లౌజులు, ఫేస్ మాస్కులు, ఫేస్‌షీల్డ్‌లు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. తొలిదశ పోలింగ్ జరగనున్న 11 జిల్లాల్లోనూ 50 వేలమంది పారా మిలిటరీ సిబ్బందిని మొహరించారు.


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో(UP Elections) ప్రధాన పోటీ బీజేపీ, బీఎస్పీ మధ్యే ఉండనుంది. 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 58 స్థానాల్లో 53 స్థానాల్ని అధికార పార్టీ బీజేపీ కైవసం చేసుకుంది. ఫిబ్రవరి, 14న రెండవ దశ, ఫిబ్రవరి 20న మూడవ దశ, ఫిబ్రవరి 23 న నాలుగవ దశ, ఫిబ్రవరి 27వ తేదీన ఐదవ దశ, మార్చ్ 3న ఆరవ దశ, మార్చ్ 7 న ఏడు దశ పోలింగ్ జరగనుంది. ఇవాళ జరగనున్న తొలిదశ పోలింగ్‌లో 2.28 కోట్లమంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. తొలిదశ అసెంబ్లీ ఎన్నికల బరిలో 623 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా, 26 వేల 27 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. పోలీసుల పర్యవేక్షణకై ప్రతి జిల్లాలోనూ 50 శాతం సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ భద్రత ఏర్పాటైంది. 


Also read: Owaisi on Hijab Issue: ముస్కాన్ ధైర్యంగా ముందుకెళ్లింది.. హిజాబ్‌పై అభ్యంతరాలు ఎందుకన్న అస‌దుద్దీన్ ఒవైసీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook