Diwali bonus to govt employees: లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( UP CM Yogi Adityanath ) శుభవార్త చెప్పారు. అన్ని శాఖలు, విభాగాలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14.82 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించారు. ఈ బోనస్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.1,023 కోట్ల భారం అదనపు భారం పడనున్నట్టు యూపీ సర్కార్ వెల్లడించింది. దీపావళి బోనస్‌లో 75 శాతం మొత్తం ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ( EPFO ) జమ కానుంది. మిగతా 25% మొత్తం నేరుగా నగదు రూపంలో ఉద్యోగుల ఖాతాలో ( Salary account ) జమ కానున్నట్టు యోగి సర్కార్ స్పష్టంచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : SRH vs RCB match: బెంగళూరును ఓడించి క్వాలిఫయర్ 2 లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్


ప్రావిడెంట్ ఫండ్ ఖాతా లేనివారికి ఆ మొత్తంతో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్‌లో ( National savings certificates ) పొదుపు చేయనున్నట్టు ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ తేల్చిచెప్పింది. నాన్‌-గెజిటెడ్ ఉద్యోగులు, ఎయిడెడ్ విద్యా సంస్థలు సిబ్బంది, లోకల్ బాడీస్, జిల్లా పంచాయతీతో పాటు దినసరి వేతనం పొందుతున్న ఉద్యోగులకు సైతం ఈ దివాళి బోనస్ వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.


Also read : Ban on firecrackers: టపాసులు కాల్చినా, విక్రయించినా రూ లక్ష జరిమానా


కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) అనంతరం అనేక ప్రభుత్వ శాఖల్లో రాబడి తగ్గిపోవడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగులకు జీతాలు  చెల్లించడానికే దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో తమ రాష్ట్ర ప్రభుత్వం తమకు దీపావళి బోనస్ ప్రకటించడంపై యూపీ సర్కార్ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.


Also read : Sriharikota: పీఎస్ఎల్‌వీ సిరీస్‌లో మరో ఘనత..రేపు ఒకేసారి పది ఉపగ్రహాల ప్రయోగం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link -  https://apple.co/3loQYe