SRH vs RCB match: బెంగళూరును ఓడించి క్వాలిఫయర్ 2 లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్

SRH vs RCB match highlights: అబుదాబి: ఐపీఎల్‌ 2020లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ( RCB ) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ) ఆల్‌రౌండ్‌ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ( Eliminator match ) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫయర్‌-2 కు అర్హత సాధించింది.

Last Updated : Nov 7, 2020, 02:42 AM IST
SRH vs RCB match: బెంగళూరును ఓడించి క్వాలిఫయర్ 2 లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్

SRH vs RCB match highlights: అబుదాబి: ఐపీఎల్‌ 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ( RCB ) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ) ఆల్‌రౌండ్‌ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ( Eliminator match ) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫయర్‌-2 కు అర్హత సాధించింది. ఈ ఓటమితో బెంగళూరు జట్టు ఐపిఎల్ నుంచి నిష్క్రమించాల్సి రాగా క్వాలిఫయర్‌-2 లో సన్‌రైజర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య రసవత్తరమైన పోటీ జరగనుంది. 

Also read : SRH vs RCB: పీకల్లోతు కష్టాల్లో ఆర్బీబీ జట్టు...వికెట్లు కోల్పోతున్న ఆర్సీబీ

ఇక ఎలిమినేటర్ మ్యాచ్ విశేషాల విషయానికొస్తే.. టాస్ గెలుచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ( SunRisers Hyderabad ) తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఏబీ డివిలియర్స్‌ ( 56: 43 బంతుల్లో 5 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించడంతో జట్టు ఆ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది. అరోన్‌ ఫించ్ (32: 30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌) జట్టు స్కోర్ ఇంకొంత పెరగడంలో సహాయపడ్డాడు. 

Also read : IPL 2020 Final: ఎంఎస్ ధోనీ ఉంటే రోహిత్‌‌దే విజయం.. కానీ ఈ ఫైనల్ సంగతేంటి!

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ( Virat Kohli ) (6) పరుగులకే వికెట్ కోల్పోయి జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ దేవదత్‌ పడిక్కల్‌ ( Devdutt Padikkal- 1) కూడా ఒక్క పరుగుకే పెవిలియన్ బాటపట్టాడు. మొయిన్‌ అలీ (0), శివమ్‌ దూబే (8), వాషింగ్టన్‌ సుందర్‌ (5), నవదీప్ శైనీ (9), మొహమ్మద్ సిరాజ్ (10) స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. 

Also read : MI vs DC match: ఢిల్లీని చిత్తుగా ఓడించి ఆరోసారి ఫైనల్‌కి చేరిన ముంబై ఇండియన్స్

132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లలో కేన్‌ విలియమ్సన్‌ ( Kane Williamson 50 నాటౌట్:‌ 44 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ గోస్వామి డకౌట్ అయ్యాడు. చివర్లో వచ్చిన జేసన్‌ హోల్డర్‌ (24 నాటౌట్‌ 20 బంతుల్లో 3ఫోర్లు) జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఓపెనర్ కేప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ ( Dawid Warner 17), మనీశ్‌ పాండే (24), ప్రియం గర్గ్ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. జట్టును గెలిపించిన కేన్ విలియమ్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.

Also read : IPL 2020 Playoff: RCB ఈసారి కూడా టైటిల్‌ కొట్టేలా లేదు: మాజీ కెప్టెన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News