Uttarakhand Cm in ByPoll: ఉత్తరాఖండ్‌లోని ఆ నియోజకవర్గంపైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమయ్యాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అక్కడి నుంచి పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. చంపావత్‌ స్థానానికి మే 31న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 47 చోట్ల బీజేపీ జయకేతనం ఎగరేసి రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకు పరిమితమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఖతిమా స్థానం నుంచి పోటీ చేసిన సీఎం పుష్కర్ సింగ్ ధామికి మాత్రం చేదు అనుభవం మిగిలింది. పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకున్నా.. ఆయన ఓటమి పాలయ్యారు. ఖతిమా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన భువన చంద్ర కప్రీ..విజయం సాధించారు. దాంతో పుష్కర్ సింగ్ ధామిని పక్కన పెట్టి వేరేవారికి సీఎంగా బీజేపీ అధిష్టానం ఛాన్స్ ఇస్తుందన్న ప్రచారం జరిగింది. అయితే వరుసగా బీజేపీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడంలో పుష్కర్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న అధిష్టానం ఆయన్నే ముఖ్యమంత్రిని చేసింది.


ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పుష్కర్ సింగ్ ధామి ఆరు నెలల్లో సీఎం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ధామీ కోసం చంపావత్ స్థానం నుంచి విజయం సాధించిన హేమేష్ కర్క్‌వాల్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. చంపావత్‌ నుంచి ఎలాగైనా విజయం సాధించాలని పుష్కర్ సింగ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. సోమవారం ఆయన అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారు.


పుష్కర్ సింగ్ ధామీని గెలిపించేందుకు బీజేపీ అధిష్టానం స్టార్ క్యాంపైనర్లను రంగంలోకి దించనుంది. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌... ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఉత్తరాఖండ్ వెళ్లనున్నారు. మొత్తంగా 40 మంది కీలక నేతలు..ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, మాజీ కేంద్ర మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్, మాజీ సీఎంలు త్రివేండ్ర సింగ్ రావత్, తిరత్  సింగ్‌ రావత్ తదతరులు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. మరోవైపు చంపావత్‌ ఉప ఎన్నిక ఫలితం జూన్ 2న వెలువడనుంది.


Also Read:Driving licence new rules: డ్రైవింగ్ లైసెన్స్‌ తీసుకోవాలా ? కొత్త రూల్స్ తెలుసా ?


Also Read:Sedition Law on Hold: రాజద్రోహం చట్టంపై స్టే.. సుప్రీం చారిత్రక తీర్పు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook