Vande Bharat Sleeper: దేశ ప్రఖ్యాతి గాంచిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరో గుడ్‌ న్యూస్‌. రైల్వే ప్రయాణీకులకు మరో భారీ గిఫ్ట్‌ ఇవ్వనుంది రైల్వే మినిస్ట్రీ. వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్లను ప్రారంభించనుంది. ఇది వచ్చే నెల ఆగస్టు 15 నుంచి ప్రారంభించనుంది. ఈ విషయాన్ని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు చెప్పారు వచ్చే నెల 15 వ తేదీ నుంచి వందే భారత్‌ ట్రైన్‌ రాకపోకలు కొనసాగించనున్నారు. ఏ రూట్లలో వందే భారత్‌ స్లీపర్‌ రాకపోకలు జరుగుతాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్లు ఈ రూట్లలో..
కొన్ని నివేదికల ప్రకారం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు హైదరాబాద్‌ కాచిగూడ, సికింద్రాబాద్‌ స్టేషన్‌ రూట్లలో వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్లను నడపనుంది. ఈ రూట్లు చాలా బిజీ కాబట్టి కాచిగూడ నుంచి విశాఖపట్నం, కాచిగూడ నుంచి తిరుపతి, సికింద్రాబాద్‌ నుంచి పూనే రూట్లలో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. ఈ వందే స్లీపర్‌ ట్రైన్‌కు 16 కోచ్‌లు ఉంటాయి. అంతేకాదు రాత్రి సమయంలో కూడా వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్ల రాకపోకలు ఉంటాయి. అంతేకాదు ఇందులో ఏసీ, నాన్‌ ఏసీ కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే, టిక్కెట్‌ ధరలు కూడా అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయని రైల్వే అధికారులు చెప్పారు.


ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ లు బుక్ చేస్తే జైలుకే.. ఆ వార్తలు ఫేక్.. IRCTC కీలక ప్రకటన..


ఈ వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ దాదాపు గంటకు 160 కీమీ వేగంతో వెళ్తుంది. ఈ ట్రైన్‌ చూడటానికి కూడా సాధారణ వందే భారత్‌ ట్రైన్‌ మాదిరిగానే కనిపిస్తుంది. ఈ వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌లో దాదాపు 823 బెర్త్‌లు ఉండనున్నాయి. అంతేకాదు ఈ ట్రైన్‌లో విమాన ప్రయాణంలో కల్పించే వెసులుబాటు ఇందులో ఉండనున్నాయి. ఇందులో కూడా ప్యాంట్రీ సదుపాయాలు ఉండనున్నాయి. అంటే ఫుడ్‌, నీరు అన్ని ఉంటాయి. ఈ వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ కు ఆటోమెటిక్‌ డోర్‌, టాయిలెట్స్‌ సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ ట్రైన్‌ సౌండ్‌ ప్రూఫ్‌ కలిగి ఉంటుంది. ఈ ట్రైన్‌ జర్నీలో నిద్ర కూడా పడుతుంది. ప్రతి కోచ్‌లో దాదాపు 250 మంది ప్రయాణం చేయవచ్చు. 


Railway Penalty Rules: రైలు ప్రయాణం చేస్తున్నారా? ఇలా చేశారంటే భారీ జరిమానా.. !


వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ సర్వీసులు నగరాలు కన్పూర్‌ - లక్నో, ఢిల్లీ- మీరట్‌, ముంబై- లోనావాల, వారణాసి- ప్రయాగరాజ్‌, పూరీ- భవనేశ్వర్‌, ఆగ్రా- మధురా మార్గాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter