Rahul Gandhi Hindu Statement: నిండు పార్లమెంట్‌లో హిందూవుల విషయమై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీని ఉద్దేశించి ఆయన శివుడి చిత్రపటం పట్టుకుని చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తప్పుబడుతున్నాయి. రాజకీయంగా మళ్లీ సరికొత్త వివాదం రాజుకుంది. రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా తాజాగా విశ్వ హిందూ పరిషత్‌ కూడా స్పందించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: DK Shivakumar: కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌సీపీ విలీనం.. డీకే శివకుమార్‌ సంచలన ప్రకటన


 


ప్రతిపక్ష నాయకుడు అయ్యాననే జోష్‌లో రాహుల్‌ గాంధీ ఇష్టారాజ్యంగా మాట్లాడారని విశ్వ హిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. నిండు పార్లమెంట్‌ సభలో రాహుల్‌ నుంచి అలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని తెలిపారు. హిందూవులను అవమానించడం.. వారినే లక్ష్యంగా చేసుకుని ఓట్లు సొంత చేసుకుందామనే తప్పుడు ఆలోచనతోనే కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళ్తోందని మండిపడ్డారు.

Also Read: Special Status: మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా.. నితీశ్‌ డిమాండ్‌తో చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి


 


విదేశాల్లో ఉండి ఒక మాట.. ఇక్కడకు వచ్చి ఒక మాట రాహుల్‌ గాంధీ మాట్లాడుతున్నారని అలోక్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. లౌకికవాదం విషయంలో హిందూవులు మాత్రమే పాటించాలా? అని ప్రశ్నించారు. క్రైస్తవులు, ముస్లింలు వారి విధానాల్లోనే ఉంటారు కానీ హిందూవులు మాత్రం లౌకికవాదులుగా మారాల్నా? అంటూ నిలదీశారు. ఈ సందర్భంగా రాహుల్‌ ప్రసంగంపై 13 అంశాలను అలోక్‌ కుమార్‌ లేవనెత్తారు. 


రాహుల్‌ గాంధీకి అలోక్‌ కుమార్‌ సంధించిన ప్రశ్నలు ఇవే..


  • పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ నాటకీయంగా మాటల దాడికి పాల్పడ్డారు. హిందూ సమాజం ఎప్పుడూ శాంతి మార్గంలోనే ఉంది.

  • విపక్ష నేత హోదాలో రాహుల్‌ తనని తాను నిరూపించుకునే జోష్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

  • ఈ జోష్‌లోనే హిందువులు హింసా ప్రవృత్తి గలవారని వ్యాఖ్యానించారు.

  • ధర్మ ప్రచారంలో గానీ, తిరిగి ధర్మంలోకి తీసుకొచ్చే సమయంలోనూ హింసా మార్గంలో నడవలేదు.

  • హిందూ సన్యాసులు దేశమంతా కాలినడక పర్యటించే సమయంలోనూ ప్రేమ, కరుణ, భక్తి, తర్కంతో ప్రజలను హిందువులుగా మార్చేవారు.

  • ఏకంగా నిండు సభలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు అస్సలు ఊహించలేనివి.

  • స్వాతంత్రం అనంతరం నుంచి కాంగ్రెస్‌లో ఇదే తంతు కొనసాగుతోంది.

  • ముస్లింలు ముస్లింలలాగా ఉండాలి, క్రిస్టియన్లు క్రిస్టియన్లలాగా ఉండాలి. హిందువులు మాత్రం సెక్యులర్‌గా ఉండాలంటున్నారు.

  • ఇదే లౌకికవాదానికి కాంగ్రెస్  ఇచ్చే నిర్వచనం.

  • రాహుల్‌ అమెరికాకి వెళ్లి జిహాదీ ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా కాషాయ  ఉగ్రవాదులు అత్యంత ప్రమాదకారులంటూ వ్యాఖ్యానించారు.

  • ఈ కాషాయ  ఉగ్రవాదం పేరిట కాంగ్రెస్ వారు అనేక మందిపై కేసులు  మోపారు. అయితే వీటికి ఎలాంటి ఆధారాల్లేవు.

  • హిందువులను అవమానించడం, వారిని టార్గెట్‌ చేయడం ద్వారా వారికి ఓట్లు దొరుకుతాయనుకోవడం తప్పుడు ఆలోచన .

  • అదే గనక నిజమైతే 99 సీట్లు  100 నుంచి వచ్చినవి కావు 545 నుంచి వచ్చాయి. అయినా, ఇప్పటికీ కాంగ్రెస్  వారి ప్రత్యర్థులు సాధించిన  సీట్లకి  చాలా దూరంలో ఉంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter