DK Shivakumar: కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌సీపీ విలీనం.. డీకే శివకుమార్‌ సంచలన ప్రకటన

DK Shivakumar Fire On Fake News About Meet With Jagan: కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌సీపీ విలీనం అంటూ విస్తృతంగా ప్రచారం జరిగిన వార్తలకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. జగన్‌తోనే తాను భేటీ కాలేదని స్పష్టం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 30, 2024, 10:54 PM IST
DK Shivakumar: కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌సీపీ విలీనం.. డీకే శివకుమార్‌ సంచలన ప్రకటన

DK Shivakumar YS Jagan Meet: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో రాయబారాలు నడుపుతున్నట్లు వస్తున్న ప్రచారంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది వెధవలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.

Also Read: NTR Bharosa Scheme: జగన్‌, చంద్రబాబు అక్కడి నుంచే.. ఆ ఊరికి అంత ప్రత్యేకం ఏమిటి?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘోర పరాభవం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 175 ఎమ్మెల్యే స్థానాల్లో కేవలం 11 మాత్రమే గెలవడంతో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. అనంతరం బెంగళూరులో పర్యటించారు. ఆ పర్యటనలో ఉన్న సమయంలోనే వైఎస్‌ జగన్‌ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ ట్రబుల్‌ షూటర్‌ డీకే శివ కుమార్‌తో సమావేశమయ్యారని వార్తలు గుప్పుమన్నాయి.

Also Read: TDP Toll Free: మీ సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పాలా? అయితే ఈ నంబర్‌కు ఫోన్‌ చేయండి

ఏపీలో మళ్లీ గెలిచే పరిస్థితులు లేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సాసీపీ విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. డీకే శివకుమార్‌ వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడంతో వారిద్దరి మధ్య సమావేశం జరిగి ఉంటుందని అందరూ భావించారు. వైసీపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి ఏపీలో బలమైన శక్తిగా మార్చేందుకు శివ కుమార్ భారీ ప్రణాళిక వేశారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఏపీలో కలకలం రేపాయి. ఏపీ రాజకీయాలతోపాటు కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశం కావడంతో డీకే శివ కుమార్‌ స్పందించారు. 

'ఎక్స్‌' వేదికగా డీకే శివ కుమార్‌ ఓ పోస్టు చేశారు.'నేను ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలిశానని కొంతమంది వెధవలు దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ఫొటోలు సృష్టిస్తున్నారు. నేను జగన్‌ను ఏనాడూ కలవలేదు. ఆ వార్తలను ఎవరూ నమ్మవద్దు' అంటూ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు ఓ వెబ్‌ పత్రికలో ప్రచురితమైన వార్తకు సంబంధించిన ఫొటోను కూడా జత చేశారు.

తాజా పరిణామంతో కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌సీపీ విలీనం అనే వార్తలకు అడ్డుకట్ట పడింది. డీకే శివ కుమార్‌ ప్రకటనతో జగన్‌ ఆయన కలవలేదని స్పష్టమైంది. దీంతో ఏపీ రాజకీయాల్లో జగన్‌, శివ కుమార్‌ భేటీ వార్త అసత్య వార్తలే అని నిరూపితమవుతోంది. ఇలాంటి అసత్య వార్తలను అధికార టీడీపీ చేయిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలోనూ ఇలాంటి అసత్య ప్రచారాలు ఎన్నో చేశారని గుర్తు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

Trending News