Weather Update: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఓ పక్క భానుడి భగభగలు కొనసాగుతుంటే..మరోవైపు చిరు జల్లులు కురుస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇటు సాయంత్రం వేళల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో నెల రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే రెండు నుంచి మూడు డిగ్రీలు అదనంగా నమోదవుతాయని చెబుతోంది. రాయలసీమ జిల్లాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప,రాయచోటి, అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 


ఇటు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు రెట్టింపు అవుతున్నాయి. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ , వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నేటి నుంచి నాలుగురోజులపాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని  వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో సోమవారం ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. 


ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం రాజులగూడ చెందిన గుణాజీ అనే బాలుడు వడదెబ్బతో చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు బాలాజీ మృతి చెందాడు. ఆహ్వాన పత్రికలు పంచేందుకు వెళ్లి వడదెబ్బకు బలైయ్యాడు. బోధ్‌ మండలంలో భవన నిర్మాణ కార్మికుడు, సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరులో అంజయ్య, యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రెడ్డి నాయక్ తండాలో బుజ్జమ్మలు వడదెబ్బతో చనిపోయారు.


మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విదర్భ నుంచి తెలంగాణ(TELANGANA) మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.  దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఏపీలోనూ అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.


Also read:CM Jagan Ramadan Wishes: ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ పండగ శుభాకాంక్షలు...


Also read:Horoscope Today May 3 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారు రియల్ ఎస్టేట్ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook