heat wave in telangana: మరో 4 రోజుల పాటు భానుడి భగభగలే..!

heat wave in telangana: తెలంగాణలో బానుడు భగ్గుమంటున్నాడు. నెల రోజులుగా జనాలు ఎండ వేడికి అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది.

Last Updated : May 3, 2022, 11:32 AM IST
  • తెలంగాణలో మండుతున్న ఎండలు
    ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత
    ఎండతీవ్రతకు అల్లాడిపోతున్న ప్రజలు
heat wave in telangana: మరో 4 రోజుల పాటు భానుడి భగభగలే..!

heat wave in telangana: ఈ సారి ఎండాకాలం మామూలుగా లేదు. ఉదయం 8 గంటలకే భగ్గున మండుతున్న ఎండలు సాయంత్రం ఐదు దాటినా తగ్గడం లేదు. ఉక్కపోత, ఎండల తీవ్రతతో జనాలు అల్లాడిపోతున్నారు. దాదాపు నెల రోజులుగా ఎండవేడికి జనం బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. వడదెబ్బకు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.  అప్పుడప్పుడు కాస్త వరుణదేవుడు కరుణ చూపినా పెద్ద ఉపశమనం మాత్రం దక్కడంలేదు. ఇలాంటి టైమ్ లో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీచేసింది.

ఎండలతీవ్రత మరో నాలుగు రోజుల పాటు మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవరసర పనులుంటే తప్ప బయటకు వెళ్లొద్దని చెబుతూ ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. ఇదే సమయంలో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నట్లు చెప్పింది. వచ్చే 48 గంటల్లో హైదరాబాద్ లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది.

మరోవైపు రాష్ట్రంలో సోమవారం కూడా అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ లో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత భూపాలపల్లి జిల్లా గ్లోరి కొత్తపల్లి, నల్లగొండడ జిల్లా కేతేపల్లిలో 44.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చాలాచోట్ల 40 నుంచి 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ లో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. 

also read: Whatsapp: భారతీయ యూజర్లకు వాట్సప్ షాక్, 18 లక్షల ఖాతాలు బ్యాన్, కారణమేంటి

also read: Rashmika gym Video: జిమ్ లో చెమటోడుస్తున్న శ్రీవల్లీ, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News