Attack on Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల సమీపించే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగింది. స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడినా..నందిగ్రామ్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినవి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు(West Bengal Elections). బీజేపీ వర్సెస్ టీఎంసీ పోటీ తీవ్రంగా ఉంది.  ఈ నేపధ్యంలో ఇవాళ జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం కల్గించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరగడంతో నందిగ్రామ్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తనపై దాడి జరిగిందని స్వయంగా మమతా బెనర్జీనే వెల్లడించారు. నందిగ్రామ్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన మమతా బెనర్డీ( Mamata Banerjee)పై ఈ దాడి జరిగింది. దాడిలో మమతా బెనర్జీ కాలికి గాయమైంది. ప్రచారాన్ని వాయిదా వేసుకుని చికిత్స కోసం కోల్‌కత్తా వెళ్లి..ఎస్ఎస్‌కే‌ఎస్ ఆసుపత్రిలో చేరారు.


నందిగ్రామ్‌(Nandigram)లో పథకం ప్రకారం తనపై దాడి జరిగిందని..నలుగురు వ్యక్తులు దాడి చేశారని మమతా బెనర్జీ తెలిపారు. దాడి జరిగినప్పుడు ఒక్క పోలీసు కూడా అక్కడ లేడని..తనపై కుట్ర జరుగుతోందని మమతా ఆరోపించారు. మమతా బెనర్జీపై జరిగిన దాడిని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు టీఎంసీ(TMC) నేతలు సిద్ధమవుతున్నారు. మరోవైపు మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని బీజేపీ(BJP) ఖండించింది. దాడి పేరుతో సానుభూతి పొందాలని భావిస్తున్నారని విమర్శించింది. 


Also read: PC Chacko: కేరళ కాంగ్రెస్‌కు షాక్..పార్టీ సీనియర్ నేత పీసీ చాకో రాజీనామా, అధిష్టానంపై అసంతృప్తి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook