West Bengal: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మనీ లాండరింగ్ కేసులో నోటీసులు పంపించిన వ్యవహారంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్ఛిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. బొగ్గు స్మగ్లింగ్ కేసుసు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, అతని భార్య రుజీరా బెనర్డీకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. ఈ అంశంపై ఆమె ఆగ్రహం చెందారు. దేశాన్ని అమ్మేస్తున్న బీజేపీ..బొగ్గు కుంభకోణంలో టీఎంసీని వేలెత్తి చూపించునందుకు ప్రయోజనం లేదని..కేంద్ర పరిధిలోనిదన్నారు. దమ్ముంటే పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. బొగ్గు గనుల స్వాహాలో బీజేపీ మంత్రుల సంగతేంటని మమతా బెనర్జీ(Mamata Banerjee)ప్రశ్నించారు. బెంగాల్, అసన్సోల్ ప్రాంతంలోని కోల్‌బెల్ట్ దోచుకున్న బీజేపీ(BJP)నాయకుల పరిస్థితి ఏంటన్నారు. గుజరాత్ చరిత్ర ఏంటో తెలుసు, తమపై ఒక కేసు పెడితే మరిన్ని కేసుల్ని వెలుగులోకి తెస్తామని దీదీ హెచ్చరించారు.ఈ అంశంపై ఎలా పోరాడాలో తమకు తెలుసన్నారు. ఎన్నికల్లో ఓటమి చెంది..ఇప్పుడు తమకు వ్యతిరేకంగా ఈడీని(ED) వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు వంటి సహజ వనరుల హక్కుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వ(Central government)పరిధిలోనిదని మమతా గుర్తు చేశారు. 


Also read: Talibans: ఇండియాతో సత్సంబంధాలే మా లక్ష్యం : తాలిబన్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook