Mamata Banerjee: ఆకాశానికి నిచ్చెన వేసుకుంటున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వినూత్నరీతిలో నిరసన తెలిపారు. రాష్ట్ర సచివాయానికి ఎలక్ట్రిక్ స్కూటీలో చేరుకున్నారు. నిరసనగా మెడలో ప్రకార్డులు ప్రదర్శించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా ఇంధన దరలకు ( Fuel prices hike )వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ హండ్రెడ్ మార్క్ దాటగా..మరి కొన్నిప్రాంతాల్లో వందకు చేరువలో ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( West Bengal cm Mamata Banerjee ) వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గురువారం వారం నాడు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ ఎక్కి సచివాలయానికి చేరుకున్నారు. ఆ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ స్కూటర్‌ను నడుపగా, మమతా హెల్మెట్‌ ధరించి వెనక సీట్లో కూర్చున్నారు. పెట్రో ధరలను నిరసిస్తూ ఫ్లకార్డును మెడలో ధరించారు. 


ఇప్పుడు మీ అందరి నోళ్లలో నానుతున్న అంశం​ ఏదని ప్రశ్నిస్తే..పెట్రోల్ ధరల పెరుగుదల ( Petrol price hike), డీజిల్ ధరల పెరుగుదల( Diesel price hike), వంట గ్యాస్ ధరల పెరుగుదల అనే సమాధానాలు వినిపస్తాయని ప్లకార్డులో రాసి ఉంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్‌ ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని గమనించివచ్చని మమతా బెనర్జీ తెలిపారు. మోదీ, అమిత్‌ షా..దేశాన్ని అమ్మేస్తున్నారని, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శించారు. మరోవైపు అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంగా ప్రసిద్ధి చెందిన మోటెరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో లీటరు పెట్రోల్ 91 రూపాయలు కాగా, ముంబైలో 97 రూపాయలుగా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే వంద రూపాయలు దాటేసింది. కోల్‌కత్తాలో లీటర్ పెట్రోల్ 91.12 రూపాయలు కాగా..చెన్నైలో 92.90 రూపాయలుగా ఉంది. అటు బెంగళూరులో 93.98 రూపాయలైతే హైదరాబాద్‌లో 94.54 రూపాయలుగా ఉంది. పెట్రో డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా తాజాగా లారీ యజమానులు ఆందోళనకు పిలుపునిచ్చారు. 


Also read: New rules for social media, digital, OTT: ఓటిటి, సోషల్ మీడియా, డిజిటల్‌కి కొత్త రూల్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook