West Bengal: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముకుల్ రాయ్ బాటలో మరి కొంతమంది ఎమ్మెల్యేలున్నట్టు తెలుస్తోంది. సువేందు అధికారికి చుక్కెదురవుతోంది. 24 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడమే దీనికి కారణం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ బెంగాల్ (West Bengal) కోటపై కాషాయ జెండా ఎగురవేయాలన్న బీజేపీ ఆశలు గల్లంతై..మూడోసారి టీఎంసీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి బీజేపీ(BJP)లో చేరిన కీలక నేత ముకుల్ రాయ్(Mukul Roy)..ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తిరిగి బీజేపీని వీడి టీఎంసీ గూటికి చేరారు. ఈయన బాటలో మరి కొంతమంది ఎమ్మెల్యేలు పయనించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో టీఎంసీ నుంచి బీజేపీలో చేరి..ప్రతిపక్ష పార్టీ నేతగా ఎన్నికైన సువేందు అధికారికి చుక్కెదురవుతోంది. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అనుచిత సంఘటనలు, పరిణామాలపై చర్చించేందుకు బీజేపీకు చెందిన ఎమ్మెల్యేలతో ఆయన గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌(Jagdeep Dhankhar)తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీకు చెందిన 24 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్ బీజేపీకు మింగుడు పడటం లేదు ముకుల్ రాయ్ బాటలో ఈ 24 మంది ఎమ్మెల్యేలు( 24 MLAs) పయనించనున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందే పార్టీలో వచ్చి వ్యక్తికి ప్రతిపక్ష నేత పదవి కట్టబెట్టడం..ఆ పార్టీలోని కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సువేందు అధికారి నాయకత్వాన్ని అంగీకరించేందుకు ఆ నేతలు సుముఖంగా లేరు. 


ఈ పరిణామాలిలా ఉంటే...బీజేపీకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని టీఎంసీ (TMC) ప్రకటించడం ఆందోళన కల్గిస్తోంది. పార్టీ వీడినవారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ..ముకుల్ రాయ్‌ని ఉద్దేశించి బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సువేందు అధికారి(Suvendu Adhikari)-గవర్నర్ సమావేశానికి గైర్హాజరైన 24 మంది ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరుతారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. 


Also read: Twitter vs Central government: ట్విట్టర్‌కు మరోసారి కేంద్రం నోటీసులు, 18న విచారణకు ఆదేశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook