Twitter vs Central government: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్‌కు కేంద్రానికి వార్ ఇంకా నడుస్తోంది. కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రం మరోసారి ట్విట్టర్‌పై గురి పెట్టింది. నిబంధనలు పాటించనందుకు నోటీసులు జారీ చేసింది.
సోషల్ మీడియాపై కేంద్ర ప్రభుత్వం(Central government) తాజాగా ఆంక్షలు విధించింది. కొత్త ఐటీ నిబంధనల్ని జారీ చేసింది. కొత్త ఐటీ నిబంధనల నేపధ్యంలో ట్విట్టర్‌కు కేంద్రానికి వార్ ఇంకా నడుస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ట్విట్టర్‌పై గురి పెట్టింది. కొత్త ఐటీ నిబంధనల్ని (New IT Rules) పాటించకపోవడంతో ట్విట్టర్‌పై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించపోవడంపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 18 వ తేదీన హాజరు కావాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది.
పదే పదే నోటీసులిచ్చినా తగిన వివరణ ఇవ్వడంలో ట్విట్టర్ (Twitter) విఫలమైందని..ఐటీ మంత్రిత్వ శాఖలోని ( IT Ministry) సైబర్ లా గ్రూప్ కో ఆర్డినేటన్ ట్విట్టర్‌కు లేఖ కూడా రాశారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ వార్తల దుర్వినియోగంపై కమిటీ తాజాగా నోటీసులిచ్చింది. జూన్ 18, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పార్లమెంటు కాంప్లెక్స్‌లోని ప్యానెల్ ముందు హాజరుకావాలని తెలిపింది. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు ఫేక్‌న్యూస్ నివారణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టత ఇవ్వాలని కోరింది. ఈసారి హాజరుకాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Also read: Oxygen Plants: కరోనా థర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం, 850 ఆక్సిజన్ ప్లాంట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook