కరోనావైరస్ ( Coronavirus ) తీసుకొచ్చిన ఆర్థిక సంక్షోభం అంతా ఇంతా కాదు.. ఆ ఆర్థిక సంక్షోభం నుంచి జనం బయటపడేందుకు కేంద్రం రెండోసారి విధించిన మారటోరియం ( Maratorium ) గడువు ఈ నెల 31న సోమవారంతో ముగియనుంది. ఇప్పటివరకు మారటోరియం ఎంచుకున్న రుణగ్రహీతలు నెలానెలా ఈఎంఐ ( EMI payments ) చెల్లించకున్నా బ్యాంకులు ఏమీ అనలేదు కానీ ఇకపై పరిస్థితి అలా ఉండే అవకాశం లేదు. మారటోరియం లేనట్టయితే.. ఇకపై నెలనెలా రుణాలపై ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డు బిల్లులు ( Credit card payments ) వడ్డీతోసహా చెల్లించకతప్పదు. లేదంటే రుణం ఇచ్చిన బ్యాంకులు ఊరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కరోనావైరస్ కారణంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి.. కొత్త ఉద్యోగాలు లభించక ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్న వారు ఇకపై నెల నెల ఈఎంఐ చెల్లించాల్సి వస్తే వారి దుస్థితి ఎంత ఇబ్బందికరమో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. Also read : New Revenue Act: త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు తమ ఖాతాల్లో ఇఎంఐకి సరిపోయే మొత్తంలో ( Sufficient funds ) నగదు నిల్వలు ఉండేలా చూసుకోవాల్సిందిగా సూచిస్తూ బ్యాంకుల నుంచి మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ మోతమోగిస్తుండటం రుణగ్రహీతలకు ఇబ్బందికరమైన పరిణామంగా మారింది. Also read : Eng vs Pak 1st T20I: ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్


Bankers on maratorium extension మారటోరియం వద్దంటున్న బ్యాంకర్స్: 
మారటోరియం కొనసాగింపును వ్యతిరేకిస్తూ బ్యాంకులు గళమెత్తుతున్న సంగతి కూడా తెలిసిందే. ముఖ్యంగా హెచ్.డిఎఫ్.సి బ్యాంక్ చైర్మన్ దీపక్ పరేఖ్, కొటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్, ఎస్బీఐ చైర్మన్ రజ్నిష్ కుమార్ వంటి బ్యాంకర్స్ అంతా మారటోరియంను కొనసాగించకూడదని తెగేసి చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలంటే మారటోరియం ఉండాల్సిందేనని పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నారు. దీంతో మారటోరియం కొనసాగింపుపై మున్ముందు ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. Also read : 
Arjun Reddy: అర్జున్ రెడ్డి డైరెక్టర్ నుంచి కొత్త సినిమా


Moratorium extension మారటోరియంను పొడిగించాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు ఎంపీ నామా లేఖ:
మారటోరియం గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో మారటోరియం గడువును ఈ ఏడాది చివరి వరకు పొడిగించాల్సిందిగా కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లోక్‌సభ టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వర్‌ రావు ( TRS MP Nama Nageshwar Rao ) శనివారం ఓ లేఖ రాశారు. కరోనావైరస్ కారణంగా ఎదురైన ఆర్థిక ఇబ్బందుల ( Financial crisis ) నుంచి ఇంకా జనం కోలుకోనందున మరోసారి మారటోరియం గడువును పొడిగించాల్సిందిగా ఎంపీ నామా ఈ లేఖ ద్వారా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. Also read : 
Suresh Raina: ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పుకున్న రైనా