New Revenue Act: త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం

తెలంగాణలో త్వరలోనే కొత్త రెవిన్యూ చట్టం రాబోతుందా అంటే అవుననే తెలుస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ( TS Assembly session ) కొత్త రెవిన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం.

Last Updated : Aug 30, 2020, 04:30 AM IST
New Revenue Act: త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం

హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలోనే కొత్త రెవిన్యూ చట్టం రాబోతుందా అంటే అవుననే తెలుస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ( TS Assembly session ) కొత్త రెవిన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చేపట్టి ఆ శాఖలో ఎప్పటి నుంచో తిష్టవేసిన అవినీతిని ( Corruption in revenue dept ) నిర్మూలించేందుకు కొత్తచట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ వస్తున్న సీఎం కేసీఆర్.. తాజాగా ఆ దిశగా చర్యలను వేగవంతం చేశారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ( CM KCR ) శనివారం అర్ధరాత్రి వరకు ప్రగతి భవన్‌లో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ సహా ఇతర అధికార యంత్రాంగం ఈ సమీక్షలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. Also read : Eng vs Pak 1st T20I: ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్

రెవెన్యూ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు, కింది స్థాయి ఉద్యోగులను ప్రభుత్వంలోని ఇతర విభాగాల్లో సర్దుబాటు చేసేటటువంటి అంశాలపైనా ఈ సమీక్షా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. కొత్త రెవెన్యూ చట్టంలో చేయాల్సిన మార్పుచేర్పులు, అవినీతికి తావులేకుండా ఉండే విధివిధానాలపై మరింత లోతైన విశ్లేషణ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. Also read : Arjun Reddy: అర్జున్ రెడ్డి డైరెక్టర్ నుంచి కొత్త సినిమా

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల ( Patta pass books ) సంఖ్య ఎంత ? ఇంకా ఇవ్వాల్సింది ఎన్ని అనే అంశాలతో పాటు వ్యవసాయ భూములు, దేవాలయ భూములు, అసైన్డ్ భూముల విస్తీర్ణం సహా అన్ని ఇతర కేటగిరీల భూముల వివరాలపై పూర్తిస్థాయి గణాంకాలతో రావాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. Also read : Naga Chaitanya: నాగ్‌కి చైతూ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్

For more interesting articles : 

  •  

Trending News