Arjun Reddy: అర్జున్ రెడ్డి డైరెక్టర్ నుంచి కొత్త సినిమా

అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా ( Sandeep Vanga ) తన తదుపరి చిత్రాన్ని త్వరలో ప్రకటించబోతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చాడు. తన తదుపరి చిత్రం ఒక క్రైమ్ డ్రామా కథ అని, ఆ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ దాదాపు పూర్తయిందని సందీప్ పేర్కొన్నాడు. 

Last Updated : Aug 30, 2020, 12:15 AM IST
Arjun Reddy: అర్జున్ రెడ్డి డైరెక్టర్ నుంచి కొత్త సినిమా

అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా ( Sandeep Vanga ) తన తదుపరి చిత్రాన్ని త్వరలో ప్రకటించబోతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చాడు. తన తదుపరి చిత్రం ఒక క్రైమ్ డ్రామా కథ అని, ఆ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ దాదాపు పూర్తయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపాడు. టి సిరీస్ ప్రధాన స్టూడియోగా వ్యవహరిస్తుంది, కాని ఈ చిత్రాన్ని సందీప్ వంగ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుందని పేర్కొన్నారు. ఐతే, ఆ చిత్రంలో హీరో ఎవరు అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. Also read : Naga Chaitanya: నాగ్‌కి చైతూ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్

ప్రభాస్‌తో ( Prabhas ) కలిసి తెలుగు, హిందీ భాషల్లో ఈ క్రైమ్ డ్రామాకు సందీప్ రెడ్డి వంగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అలాగే గతంలో రామ్ చరణ్, మహేష్ బాబు, రణబీర్ కపూర్‌లకు ( Ram Charan, Mahesh Babu, Ranbir Kapoor ) కూడా ఆయన స్టొరీ వినిపించినట్లు టాక్ వినిపించింది. ఐతే ఎందుకో ఏమో తెలియదు కానీ ఆ ప్రాజెక్టులు ఏవీ కార్యరూపం దాల్చలేదు. Also read : HBD Akkineni Nagarjuna: మన్మథుడికి శుభాకాంక్షల వెల్లువ

మూడు సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ (  Vijay Deverakonda ) నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో సందీప్ వంగా తొలిసారిగా డైరెక్టర్‌గా టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుందన్న విషయం తెలిసిందే. Also read :  Vakeel Saab updates: వకీల్ సాబ్ టీజర్‌కి సమానంగా మోషన్ పోస్టర్

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం :

Trending News