CSK star batsman Suresh Raina out of IPL: ఐపీఎల్ 2020 కోసం ఉత్సాహంగా దుబాయ్‌లో అడుగు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. ఆగస్టు 15న మహేంద్ర సింగ్ ధోనితో కలిసి అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన సురేష్ రైనా ( Suresh Raina ).. ఐపీఎల్ టోర్నీకీ సైతం దూరమయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా ఐపీఎల్ టోర్నీ నుంచి వ్యక్తిగత కారణాలతో దుబాయ్ నుంచి తిరిగి భారత్‌కు చేరుకున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈఓ కేఎస్ విశ్వనాథన్ ధ్రువీకరించారు. ఈమేరకు చెన్నై సూపర్ కింగ్స్ శనివారం ట్విట్ చేసింది. రైనా ఐపీఎల్ సీజన్ 2020 (IPL-2020) కి అందుబాటులో ఉండడని, ఈ సమయంలో సీఎస్కే అతని కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటుందని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పేర్కొంది. Also read: IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ కు తాకిన కరోనా వైరస్
Suresh Raina has returned to India for personal reasons and will be unavailable for the remainder of the IPL season. Chennai Super Kings offers complete support to Suresh and his family during this time.
KS Viswanathan
CEO— Chennai Super Kings (@ChennaiIPL) August 29, 2020
ఇదిలాఉంటే.. ఐపీఎల్ 2020లో భాగంగా అందరికంటే ముందు ప్రాక్టీస్ మొదలుపెట్టాలని దుబాయ్ చేరుకున్న సీఎస్కే జట్టుకు వరస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఒక బౌలర్‌తో పాటు పలువురు స్టాఫ్ మెంబర్స్ కరోనా (Coronavirus) బారిన పడ్డారు. సీఎస్కే జట్టులో దాదాపు 10 మంది కరోనా సోకింది. అయితే ఈ క్రమంలోనే ఆ జట్టు ఫేవరెట్ బ్యాట్స్‌మెన్ టీం నుంచి తప్పుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు