కరోనా వైరస్ ( Corona virus ) నియంత్రణలో భారత ప్రయత్నాల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడుతోంది. ముఖ్యంగా కోవ్యాగ్జిన్ ( Covaxin ) తయారీలో భారతదేశ చిత్తశుద్ధిని కొనియాడుతూ మోదీకు ధన్యవాదాలు తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ప్రయత్నిస్తోంది. మరి కొద్ది రోజుల్లో వ్యాక్సిన్ విడుదల చేసే దేశాల సరసన ఇండియా కూడా చేరిపోయింది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ( Bharat Biotech company ) అభివృద్ధి చేస్తున్న కోవ్యాగ్జిన్ త్వరలో మూడవ దశ ప్రయోగాల్ని పూర్తి చేసుకోనుంది. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health organisation ) డైరెక్టర్ డనరల్ టెడ్రోస్ ( Tedros ) అథనాన్ ప్రధాని నరేంద్రమోదీ ( Pm Narendra modi ) కు ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రధాని చేస్తున్న కృషిని టెడ్రోస్ అభినందించారు. కరోనా వైరస్ అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అని...ఈ సమస్య పరిష్కారానికి కావాల్సిన వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌కు పూర్తి సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, టెడ్రోస్ అథనాన్ లు సంప్రదాయ ఔషధాల విషయమై ఫోన్ లో మాట్లాడారు. ప్రపంచానికి సంప్రదాయ ఔషధాల అవసరం ఎంతో ఉందని.. వాటిపై మరింత పరిజ్ఞానం, పరిశోధనలు అవసరమని చెప్పారు.  


కరోనా వైరస్ సమయంలో ప్రపంచం మొత్తాన్ని ఒక్కటి చేసి, మహమ్మారిని ఎదుర్కొనేందుకు డబ్ల్యూహెచ్‌ఓ చేసిన చర్యలను ప్రధాని మోదీ కొనియాడారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆరోగ్య ప్రమాణాల విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ సహకారం ముఖ్యమైందని మోదీ తెలిపారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సంప్రదాయ ఔషధాలలో ఉన్న విలువల గురించి మాట్లాడారు. ప్రస్తుత వైద్య విధానంలో సంప్రదాయ ఔషధాల్ని వినియోగించాల్సిన అవసరం ఉందని  చెప్పారు. దీనికి సంబంధించి శాస్త్రవేత్తల్నించి అనుమతి లభించగానే కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. నవంబర్ 13న దేశంలో ఆయుర్వేద దినోత్సావాన్ని జరపుతున్నామని ఈ సందర్భంగా చెప్పారు. Also read: IPL2020: డాట్ బాల్స్ అత్యధికంగా వేసిన టాప్ 10 బౌలర్లు వీళ్లే..