Hyderabad BJP MP Candidate Madhavi Latha Profile: ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లకు లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు బరిలోకి కూడా బలమైన అభ్యర్థులతో పోటీ చేయాలని ఆశిస్తోంది. అయితే, హైదరాబాద్‌ తరపున అనూహ్యంగా బీజేపీ ఎంపీ టిక్కెట్‌ ఏ అనుభవం లేని ఒకరికి మాత్రం కేటాయించింది. అంత బలమైన అభ్యర్థి ఎవరు? అది కూడా ఎంఐఎంకు కంచుకోట అయిన హైదరాబాద్ తరపున బరిలోకి దింపుతున్నారు. ప్రస్తుత ఈ పేరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం అదాలత్‌లో ఆమె మాటతీరుపై ప్రశంసించారు. ఆప్‌ కీ అదాలత్ ఎపిసోడ్‌ అసాధారణమైందని కొనియాడారు. ఆమె ఎవరోకాదు డాక్టర్ మాధవీలత. ఈమెను హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపుతున్నారు. ఏళ్ల అనుభవం ఉన్న అసదుద్దీన్‌కు పోటీగా ఈమెను బీజేపీ తరపున నిలబెడుతున్నారు. ఆమె ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎవరీ మాధవీలత..
డాక్టర్‌ కొంపెల్ల మాధవీలత హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రి అయిన విరించీ ఆస్సత్రికి చైర్మన్. ఈమె బలమైన హిందూవాదీ కూడా ఎన్నో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ యజ్ఞయాగాదులను నిర్వహించారు. కొన్ని కోట్ల ఆస్తి ఉంది అయినా కానీ, మడిచీరలే కడుతుంది. ఎక్కడికి వెళ్లినా మెడలో కేవలం నల్లపూసల దండే ఉంటుంది. 


విద్యాభ్యాసం..
హైదరాబాద్‌ పాతబస్తీలో పుట్టి పెరిగన మాధవీలత నిజాం కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ, కోఠీ ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశారు. మాధవీలత భరతనాట్య కళాకారిణి కూడా. ఈమె సుమారు 100 కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.


ఇదీ చదవండి: విజయశాంతి ఎక్కడ? ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించని రాములమ్మ..


వేదఘోష @ పాతబస్తీ..
ప్రతిరోజూ అశేష జన భక్తసందోహం మధ్య అనేక యజ్జయాగాలు జరిగాయి.  పాతబస్తీలో ఆధ్యాత్మిక వైభవం కనిపించింది. భారత భాగ్యసమృద్ధి యాగం అని పేరు పెట్టారు. పాతబస్తీలో వేదఘోష వినిపించింది. ధర్మహితం, దేశరక్షణ కోసం యజ్జయాగాదులు చేయించారు మాధవీలత.


లతామా ఫౌండేషన్..
మాధవీలత లతామా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు అందిస్తున్నారు. విరించీ హస్పిటల్ అధినేత. ఆమె చేస్తున్న ఈ సంకల్పానికి ఎంతో మంది ఫిదా అవుతున్నారు..ఇలా ఈమె చేస్తున్న సేవలను బీజేపీ గుర్తించి ఆమెకు ఎంపీ టిక్కెట్‌ను ఇచ్చింది.


ట్రస్టు ద్వారా సేవలు..


కరోనా సమయంలోను తమ చారిటబుల్ ట్రస్ట్‌ ద్వారా నగరంలో పలు ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహార పంపిణీలు చేశారు. సుమారు 1018 వరకు గర్భిణులకు ఉచిత డెలివరీలు చేయించింది. ఇంకా పేరెంట్‌గా ఎలా ఉండాలో కూడా తల్లిదండ్రులకు చిట్కాలను అందిస్తుంది. అంతేకాదు మాధవీలతకు టీచర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ప్రత్యేకంగా ఆమె తన పిల్లలను హోం స్కూల్లోనే చదివించారు. ప్రస్తుతం ఆమె పిల్లలు ఐఐటీ చదువుతున్నారు.


ఇదీ చదవండి: అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారా.. ? కాంగ్రెస్ అగ్రనేత స్ట్రాటజీ అదేనా..?


Y కేటగిరీ భద్రత..
ప్రధాని మోడీ నాయకత్వం, బీజేపీ పాలనలు చూసి ఆమె బీజేపీలో చేరారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చేవారు. అందుకే నారీశక్తి మాధవీలతను బీజేపీ తరపున నిలబెట్టింది. హైదరాబాద్‌ సీటీ గత దశాబ్దాలుగా ఎంఐఎంకు కంచుకోటగా నిలుస్తోంది. ఈసారి మాధవీలత అసదుద్దీన్‌కు గట్టి పోటీ ఇస్తారా? చూడాలి. ప్రస్తుతం ఆమకు 11 మందితో సెక్యూరిటీని కూడా కల్పించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook