Atiq Ahmed, Ashraf Ahmed Killers' Motive: అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ల జంట హత్యలపై ప్రయాగ్‌రాజ్ పోలీసు కమిషనర్ రమిత్ శర్మ స్పందిస్తూ.. హత్యలు జరిగిన తీరుతెన్నుల గురించి వెల్లడించారు. అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌లను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లే క్రమంలో పోలీసు వాహనం దిగిన అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ సోదరుల వద్ద మీడియా ప్రతినిధులు బైట్స్ తీసుకునేందుకు వచ్చారు. మీడియా ప్రతినిధుల రూపంలో వారితో పాటే కలిసి వచ్చిన ముగ్గురు దుండగులు కూడా అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ సోదరుల వద్ద బైట్స్ తీసుకునేందుకు వచ్చి కాల్పులకు పాల్పడినట్టు ప్రయాగ్‌రాజ్ పోలీసు కమిషనర్ రమిత్ శర్మ తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌లపై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సోదరులు ఇద్దరూ స్పాట్‌లోనే మృతి చెందగా మరొక జర్నలిస్ట్ గాయపడ్డాడు. కాల్పులకు పాల్పడిన ముగ్గురు దుండగులను పోలీసులు ఘటన స్థలంలోనే తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ సోదరుల హత్యపై మర్డర్ కేసు నమోదు చేసుకున్న ప్రయాగ్ రాజ్ పోలీసులు.. ప్రస్తుతం నిందితులను ప్రశ్నిస్తున్నారు. పోలీసుల విచారణలో అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ హంతకులు కీలక వివరాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. 


ప్రస్తుతం అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ సోదరులను కాల్చిచంపిన దుండగులు అందుకు గల కారణాలను పోలీసులకు వెల్లడించినట్టు తెలుస్తోంది. అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ లాంటి మాఫియా డాన్లను మట్టుబెట్టడం ద్వారా మరో మాఫియా డాన్స్ గా పాపులర్ అవ్వాలని హంతకుల ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఏకంగా పోలీసులు, మీడియా సమక్షంలోనే అతిక్‌ని మర్డర్ చేసి తామేంటో నిరూపించుకోవాలనుకున్నామని.. అందుకే అతిక్ సోదరులను వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా తమ ప్లాన్ అమలు చేశామని పోలీసుల విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. 


ఇది కూడా చదవండి: Atiq Ahmed, Ashraf Ahmed Shot Dead: ఆతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మెద్‌లని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపిన దుండగులు


అతిక్ అహ్మద్ సోదరులను ఇద్దరినీ చంపడం ద్వారా అతీక్ గ్యాంగ్ అనేదే లేకుండా చేయాలని అనుకున్నామని ముగ్గురు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే, దీనిపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేరానికి పాల్పడిన ముగ్గురు కూడా నేరచరిత్ర ఉన్నవాళ్లేనని పోలీసులు తెలిపారు. అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ సోదరుల మర్డర్ కేసులో ఎఫ్ఐఆర్ కాపీలోనూ పోలీసులు ఇదే వివరాలు పొందుపర్చినట్టు సమాచారం. అతిక్ అహ్మద్ సోదరుల హత్యతో ప్రయాగ్‌రాజ్‌లో యూపీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పట్టణంలో ఇంటర్నెట్ సేవలు నిషేధించి కర్ఫ్యూ విధించారు. 


ఇది కూడా చదవండి: CBI Summons Arvind Kejriwal: దమ్ముంటే ఆ పని చేయ్.. కేజ్రీవాల్‌కి బీజేపి సవాల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK