Angry Wife: నా భార్య కోపంగా ఉంది.. 10 రోజులు సెలవు కావాలి.. పోలీస్ ఆఫీసర్ లీవ్ లెటర్ వైరల్

Police Officer's wife : జిల్లా ఎస్పీకి లీవ్ లెటర్ రాసిన ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్... అందులో తన 22 ఏళ్ల గోసను వెలిబుచ్చాడు. తనకు పెళ్లయి 22 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు హోలీ పండగను తన పుట్టింట్లో చేసుకోలేదని నా భార్య గొడవ చేస్తోందని చెప్పుకొచ్చాడు. 

Written by - Pavan | Last Updated : Mar 9, 2023, 11:36 AM IST
Angry Wife: నా భార్య కోపంగా ఉంది.. 10 రోజులు సెలవు కావాలి.. పోలీస్ ఆఫీసర్ లీవ్ లెటర్ వైరల్

Police Officer's wife : నా భార్య కోపంగా ఉంది. పెళ్లయి 22 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తన తల్లిగారింట్లో హోలీ పండగ చేసుకోలేదని.. ఏదేమైనా సరే ఈసారి తనను అక్కడకు తీసుకుని వెళ్లాల్సిందేనని ఒత్తిడి చేస్తోందని వాపోతూ ఓ పోలీసు ఆఫీసర్ తన ఉన్నతాధికారికి రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫరుఖాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ లేఖ రాసింది కూడా ఎవరో చిన్న స్థాయి ఉద్యోగి కాదు.. ఇన్‌స్పెక్టర్ స్థాయి ర్యాంక్ అధికారి జిల్లా ఎస్పీకి రాసిన లీవ్ లెటర్ ఇది. హోలీ పండగ నేపథ్యంలో 10 రోజుల పాటు సెలవులు కావాలని కోరుతూ సదరు అధికారి జిల్లా ఎస్పీకి ఈ లేఖ రాశాడు.

జిల్లా ఎస్పీకి లీవ్ లెటర్ రాసిన ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్... అందులో తన 22 ఏళ్ల గోసను వెలిబుచ్చాడు. తనకు పెళ్లయి 22 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు హోలీ పండగను తన పుట్టింట్లో చేసుకోలేదని నా భార్య గొడవ చేస్తోంది. ఎలాగైనా సరే ఈ హోలీ పండగను తన పుట్టింట్లోనే చేసుకోవాలని.. నేను కూడా సెలవు పెట్టుకుని వెంట రావాలని మొండి పంతం పట్టుకుని కూర్చింది. కావున నా పరిస్థితి అర్థం చేసుకుని నాకు 10 రోజుల పాటు సెలవు మంజూరు చేయలగలరు అంటూ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ జిల్లా ఎస్పీని వేడుకున్నాడు.

ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏంటంటే.. పాపం ఆ లీవ్ లెటర్ చదవడంతోనే అతడి ధీన స్థితిని అర్థం చేసుకున్న జిల్లా ఎస్పీ.. మార్చి 4 నుంచి ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ కి 5 రోజుల పాటు సెలవు మంజూరు చేశాడు. సాధారణంగా పోలీసు డిపార్టుమెంటులో పండగలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలోనే బందోబస్తు పేరుతో కచ్చితంగా డ్యూటీకి హాజరై తీరాల్సిన పరిస్థితి ఉంటుంది. వారికి పండగ పూట సెలవు అనేది అసాధ్యం. ఇక్కడ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ విషయంలోనూ అదే జరిగింది. 22 ఏళ్ల వైవాహిక జీవితంలో ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ భార్య బరస్ట్ అయ్యే రోజు వచ్చింది. ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ కూడా తన స్థాయిని మర్చిపోయి మరీ జిల్లా ఎస్పీని సిగ్గువిడిచి, ఉన్న పరిస్థితి చెప్పుకుని లీవ్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ లేఖ ఎలా లీక్ అయిందో ఏమో కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ భార్య పంతం నెగ్గించుకుంది. 

ఇది కూడా చదవండి : Giant Python Viral Video: భారీ పైథాన్‌తో అమ్మాయి.. వీడియో వైరల్

ఇది కూడా చదవండి : Cobra Snake Laying Eggs: పాము గుడ్లు పెట్టడం ఎప్పుడైనా చూశారా ?

ఇది కూడా చదవండి : Cheetah Hunting Its Prey: చిరుతపులి వేటాడే సీన్ చూస్తే గూస్‌బంప్స్ రావడం పక్కా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo

Trending News