Woman jumped off Delhi Metro Station: ఢిల్లీ అక్షర్‌ధామ్ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన యువతి (22).. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతి కిందకు దూకిన సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది బ్లాంకెట్స్‌తో ఆమెను పట్టుకున్నప్పటికీ... అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలవడంతో ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంజాబ్‌లోని హోషియర్‌పూర్‌కి చెందిన ఆ యువతి గుర్గావ్‌లోని ఓ ఆసుపత్రిలో కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్షర్‌ధామ్ మెట్రో స్టేషన్‌కు వచ్చిన యువతి ఆత్మహత్యకు యత్నించింది. అయితే యువతి ఎందుకు ఆత్మహత్యకు యత్నించిందనేది తెలియలేదు. అనారోగ్య సమస్యలే యువతి ఆత్మహత్యకు కారణమా.. లేక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.


యువతి ఆత్మహత్య ఘటనపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది మాట్లాడుతూ... గురువారం (ఏప్రిల్ 14) ఉదయం 7.30గం. సమయంలో మెట్రో స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ 2 అంచున యువతి నిలబడి ఉండటం గమనించామన్నారు. ఒక టీమ్ ఆమెను కిందకు దూకొద్దని వారిస్తుండగా... మరో టీమ్ మెట్రో స్టేషన్ కింద బ్లాంకెట్స్ పట్టుకుని సిద్ధంగా ఉందన్నారు. యువతి కిందకు దూకేయడంతో వెంటనే కింద ఉన్న టీమ్ ఆమెను బ్లాంకెట్స్‌తో పట్టుకున్నారని చెప్పారు. అయితే లోపలి భాగాలకు తీవ్ర గాయాలవడం వల్లే యువతి మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.


యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ గాయాల తీవ్రత కారణంగా ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతురాలు గత రెండేళ్లుగా ఢిల్లీలో పనిచేస్తున్నట్లు ఆమె నానమ్మ తెలిపారు. అయితే ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుందో తమకూ తెలియట్లేదని వాపోయారు. 


Also Read: F3 Movie: ఎఫ్‌ 3 స్పెష‌ల్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్.. హాట్ సమ్మర్‌లో కూల్ అందాలు!


Zodiac sign Nature: ఈ రాశుల పిల్లలకు సాధ్యం కానిదంటూ ఉండదట తెలుసా..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook