Suicide in Metro Station: మెట్రో స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడిన యువతి.. వీడియో వైరల్!

Suicide in Metro Station: మెట్రో స్టేషన్‌లో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్ లో జరిగిన ఈ ఘటనలో గుర్తుతెలియని ఓ యువతి గురువారం ఉదయం ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను కాపాడేందుకు CISF జవాన్స్ రంగంలోకి దిగారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 01:45 PM IST
Suicide in Metro Station: మెట్రో స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడిన యువతి.. వీడియో వైరల్!

Suicide in Metro Station: ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్‌లో గురువారం ఉదయం 7.28 గంటలకు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఓ యువతి మెట్రో స్టేషన్ గోడపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ విషయం ఢిల్లీలో కలకలం రేపింది. 

అయితే ఈ ఘటనలో ఆ యువతిని CISF సైనికులు ప్రాణాలతో రక్షించారు. అంతుకుముందు ఆత్మహత్య చేసుకోవద్దని ఎంతమంది చెప్పినా ఆమె వినలేదు. గోడ దిగి రావాలని పోలీసులు కోరినా ఆమె అందుకు అంగీకరించలేదు. 

అంతలోనే అక్కడున్న CISF జవాన్లు ఆ యువతిని మాటల్లో పెట్టి.. ఆమె దూకబోయే ముందు మెట్రో స్టేషన్ కింద రక్షణ వలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో ముందు జాగ్రత్తగా అంబులెన్స్ ను కూడా అధికారులు పిలిపించారు. 

అంతలోనే CISF సిబ్బంది ఆ యువతితో మాట్లాడుతుండగానే.. ఆమె కిందికి దూకేసింది. ఆ తర్వాత వెంటనే కింద ఉన్న రక్షణ సిబ్బంది ఆమెను కాపాడారు. ఈ ఘటనలో ఆ యువతికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read: Shocking Video: రైలు ఎదురుగా దూసుకుంటూ వచ్చినా.. ఆమెకు సెల్ ఫోనే ముఖ్యం!

Also Read: Tricky Question: ఈ చిత్రంలో ఉన్న గ్లాసుల్లో ఏది త్వరగా నీటితో నిండిపోతుంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News