Spill Milk: రోడ్లపై ఏరులై పారిన పాలు.. వీడియోలు వైరల్
పాడి రైతులు రోడ్డుపై ట్యాంకర్లకు ట్యాంకర్లు, వేలాది లీటర్ల పాలు (Spill Milk On Roads) పారబోశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొందరు పాడి రైతులు రోడ్డుపై ట్యాంకర్లకు ట్యాంకర్లు, వేలాది లీటర్ల పాలు (Spill Milk On Roads) పారబోశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో వేలాది లీటర్ల పాలను అలా రోడ్లపై పారబోసి నిరసన తెలపడంతో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. పాల ఉత్పత్తులపై విధించే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని రద్దు చేయాలని, కనీసం మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కీలక తరుణంలో భారత్‌కు రఫేల్ యుద్ధ విమానాలు
స్వాభిమాన్ షెట్కారీ సంఘటన్ (Swabhimani Shetkari Saghtana) అనే రైతు సంస్థకు చెందిన చెందిన సభ్యులు, రైతులు గత కొంత కాలం నుంచి పాల ధర లీటర్‌కు కనీస మద్దతు ధర రూ.25 చేయాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించడం లేదు. తమ కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. దీన్ని జీర్ణించుకోలేక స్వాభిమాన్ సభ్యులు, రైతులు తమకు వీలైనట్లుగా ట్యాంకర్లు, పెద్ద పెద్ద క్యాన్లలో లోడ్లు తీసుకొచ్చి అందరూ చూస్తుండగానే బెంగళూరు - పుణె రహదారిపై, పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లి, కొల్లాపూర్ జిల్లాల్లో, మరిన్ని ప్రాంతాల్లో రోడ్లపై పారబోసి నిరసన తెలిపారు. హాట్ మోడల్, ఫుట్‌బాల్ రిఫరీ ఫొటోలు వైరల్
ఆవు పాలు లీటర్‌కు (Milk Price) రూ.25 కనీస మద్దతు ధర ప్రకటించని కారణంగా వేలాది లీటర్ల పాలు రోడ్లపై పారబోసి తమ ఆవేదనను వ్యక్తం చేశామని పాడి రైతులు, స్వాభిమాన్ సభ్యులు చెబుతున్నారు. కొన్ని గంటలకే మహారాష్ట్ర పవుసంవర్ధకశాఖ మంత్రి సునీల్ కేదార్ స్పందించారు. స్వాభిమాన్ షెట్కారీ సంఘటన్ ముఖ సభ్యుడు సదాభౌ నాట్‌తో చర్చలు మొదలుపెట్టారు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
Bigg Boss 4 కంటెస్టెంట్స్ వీళ్లేనా.. స్టార్ మా ఫిక్స్ అయ్యిందా!