Ramdev Baba U Turn: అల్లోపతి వైద్యంపై వ్యాఖ్యలపై రాందేవ్ బాబా యూ టర్న్, కారణమేంటి
Ramdev Baba U Turn: యోగా గురువు రాందేవ్ బాబా యూ టర్న్ తీసుకున్నారు. అల్లోపతి వైద్యం, డాక్టర్లపై చేసిన వ్యాఖ్యలతో సర్వత్రా నిరసన వ్యక్తం కావడంతో యూటర్న్ తప్పలేదు. ఇప్పుుడా వైద్యులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Ramdev Baba U Turn: యోగా గురువు రాందేవ్ బాబా యూ టర్న్ తీసుకున్నారు. అల్లోపతి వైద్యం, డాక్టర్లపై చేసిన వ్యాఖ్యలతో సర్వత్రా నిరసన వ్యక్తం కావడంతో యూటర్న్ తప్పలేదు. ఇప్పుుడా వైద్యులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అల్లోపతి వైద్యం, అల్లోపతి వైద్యులపై తీవ్ర వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న యోగా గురువు(Yoga Guru), పతంజలి (Patanjali) సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా హఠాత్తుగా మనసు మార్చుకున్నారు. యూటర్న్ తీసుకుని..వైద్యుల్ని దైవదూతలతో పోల్చుతున్నారు. తన పోరాటం వైద్యులపై కాదని..మాదక ద్రవ్యాల మాఫియాపై అంటూ ప్రకటించారు. గతంలో చేసిన ప్రతి వ్యాఖ్యకు వ్యతిరేకంగా గళం విప్పారు. గతంలో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఉపయోగం లేదని చెప్పిన రాందేవ్ బాబా..ఇప్పుడు తాను కూడా త్వరలో వ్యాక్సిన్ (Corona Vaccine) తీసుకుంటానంటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవమైన జూన్ 21 నుంచి అందరికీ ఉచిత వ్యాక్సిన్ ప్రకటించడంపై రాందేవ్ బాబా ప్రధాని మోదీపై (Pm Narendra modi) ప్రశంసలు కురిపించారు.
శస్త్ర చికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి వైద్య విధానం ఉత్తమమైందంటున్నారు రాందేవ్ బాబా(Ramdev Baba). అత్యవసర మందులు, చికిత్స పేరుతో ప్రజల్ని దోపిడీ చేయడాన్నే తాను వ్యతిరేకిస్తున్నానని..భారతీయ వైద్య వ్యవస్థను ద్వేషించడం లేదని చెప్పారు. యోగా, ఆయుర్వేదాన్ని ప్రజలంతా ఆదరించాలని..వ్యాధుల నివారణకు యోగా కవచంలా దోహదపడుతుందని తెలిపారు. కరోనా నుంచి యోగా అందర్నీ రక్షిస్తుందన్నారు.
వ్యాక్సిన్ సామర్ధ్యం, అల్లోపతి వైద్యం(Ayurvedam), వైద్యుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబాకు ఐఎంఏ లీగల్ నోటీసులు జారీ చేసింది. అటు ఆయనపై చర్యలు తీసుకోవల్సిందిగా ఐసీఎంఆర్‌కు (ICMR) ఐఎంఏ లేఖ కూడా రాసింది. ఈ నేపధ్యంలో రాందేవ్ బాబా తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also read: Corona Third Wave: 5 ఏళ్లలోపు చిన్నారులకు Face Masks అక్కర్లేదు, DGHS సూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook