Gold Monetization Scheme: లాకర్ లో ఉన్న మీ బంగారంతో డబ్బు సంపాదించండి
బంగారం ఇంట్లో ఉంచడం అనేది కాస్త రిస్కుతో కూడుకున్న విషయం. కాబట్టి చాలా మంది బ్యాంకు లాకర్ లో వాటిని దాచుతుంటారు.
బంగారం ఇంట్లో ఉంచడం అనేది కాస్త రిస్కుతో కూడుకున్న విషయం. కాబట్టి చాలా మంది బ్యాంకు లాకర్ లో వాటిని దాచుతుంటారు. దీనికి బ్యాంకులకు చార్జీలు చెల్లిస్తుంటారు. అయితే మీరు కూడా ఇలా చేస్తుంటే మాత్రం మీరు ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించే అవకాశం ఉంది. దీని కోసం మీరు లాకర్ ఫీజుల చెల్లించే అవసరం లేదు. ఇతర చార్జీలు కూడా చెల్లించే అవసరం లేదు. సింపుల్ గా మీ వద్ద ఉన్న బంగారాన్ని రిజర్వు బ్యాంకు గుర్తించిన బ్యాంకులో డిపాజిట్ చేసి వడ్జీని సంపాదించవచ్చు. ఆర్బిఐ ( RBI ) గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో భాగంగా బంగారాన్ని బ్యాంకులో ఫిక్సుడ్ డిపాజిట్ చేయవచ్చు. మీ బంగారం ఎంత ఉందో దానిపై మీకు వడ్డీ వస్తుంది.
ALSO READ| Online Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి
వడ్డీ ఓకే ! మరి గోల్డ్ సంగతి ఏంటి ?
మీ బంగారాన్ని బ్యాంకులు జాగ్రత్తగా చూసుకుంటాయి. దీంతో మీరు బంగారాన్ని ( Gold ) ఎక్కడ ఉంచాలి అనే టెన్షన్ నుంచి దూరంగా ఉండవచ్చు. రిజర్వు బ్యాంకు కేటాయించిన బ్యాంకుల్లో ( RBI Designated Banks ) ఈ స్కీమ్ అమలులో ఉంది.
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లేదా రివాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫీచర్స్ ఇవే.
భారతదేశంలో ( India ) ఉంటున్న భారతీయ పౌరుడు ఈ స్కీమ్ ను వినియోగించుకోవచ్చు. గోల్డ్ ఎఫ్డీ ని జాయింట్ పేర్లుగా కూడా తీసుకోవచ్చు. బంగారాన్ని ముడి బంగారం, నాణేలు, ఆభరణాల రూపంలో స్వీకరిస్తారు. అయితే రాయి విలువ, ఇతర లోహాల విలువను తీసి వేస్తారు. మినిమం ముప్పై గ్రాములు.. మ్యాగ్జిమం పై ఎలాంటి లిమిట్ లేదు. ఒక సంవత్సరం నుంచి 15 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి
పథకాలు-
* షార్ట్ టెర్మ్ బ్యాంకు డిపాజిట్ ( STBD): కాల పరిమితి 1-3 సంవత్సరాలు
* మీడియం టెర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ ( MTGD): కాల పరిమితి 5-7 సంవత్సరాలు
* లాంగ్ టెర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ ( LTGD): కాలపరిమితి 12-15 సంవత్సరాలు
మీడియం, లాంగ్ టెర్మ్ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వం తరపున బ్యాంకులు డిపాజిట్లు స్వీకరిస్తాయి.
వడ్డీ రేట్లు ( సంవత్సరానికి )
- సంవత్సరానికి : 0.50 శాతం ( సంవత్సరానికి )
- 1 నుంచి 2 సంవత్సరాలు : 0.55 శాతం
- 2 నుంచి 3 సంవత్సరాలు : 0.60 శాతం
- మీడియం, లాంగ్ టెర్మ్ లో : 2.25 శాతం వడ్డీ చెల్లిస్తారు.
ALSO READ| Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట
తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అంశాలు
* గడువుకు ముందు స్కీమ్ ను బ్రేక్ చేస్తే వడ్డీపై పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
* మెచూరిటీ తరువాత మీరు ఇచ్చిన గోల్డ్.. మీరు ఇచ్చినట్టు మాత్రం తిరిగి రాదు. దాన్ని కరిగించి దాచడం వల్ల మీకు బంగారం మాత్రమే వస్తుంది. ఆభరణం మాత్రం కాదు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR