Kidnap drama: సినిమా ఓ రంగుల ప్రపంచం. ఈ రంగంలో నిలదొక్కుకోవాలని కోటి ఆశలతో ఎంతో మంది.. ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రంగంలో అనుకున్నది సాధిస్తే లైఫ్​ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా (Cinema life) చెప్పనక్కర్లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ అంత సులువుగా సినీ రంగంలో సెక్సెస్​ రాదు అనేది చాలా మంది చెప్పే మాట. వేలాది మంది సెక్సెస్​ కోసం ప్రయత్నిస్తే. అందులో పదుల సంఖ్యలో మాత్రమే విజయం సాధిస్తారని.. చాలా మంది  అంటుంటారు.


ఇలాంటి కలలతోనే సినీ రంగంలోకి వచ్చిన ఓ యువకుడు చేసిన పని అందరిని విస్తుపోయేలా చేసింది. రీల్ సినిమా తీసేందుకు ముందు.. రియల్​ లైఫ్​లో ఆడిన ఓ నాటకం బెడిసికొట్టి అందరి ముందు దోషిలా (Chennai Crime news) నిలబడ్డాడు.


ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడంటే..


సినిమా రంగంలో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో చెన్నైకి చెందిన ఓ యువకుడు తన ప్రయత్నాలు చేస్తున్నాడు. షార్ట్​ ఫిలిమ్స్​ చేస్తూనే ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అయితే ఇటీవల ఆ యువకుడు సొంతంగా ఓ షార్ట్​ ఫిల్మ్​ను (Short Film Director crime) తీయాలనుకున్నాడు. ఇందుకోసం రూ.30 లక్షలు కావాలను తన తండ్రిని అడిగాడు.


కొడుకు అంతలా అడగటంతో కాదనలేక.. అక్కడా ఇక్కడ సర్ధి రూ.5 లక్షలు అందించాడు ఆ తండ్రి. అయితే ఆయువకుడు మిగతా డబ్బు కూడ తన తండ్రి నుంచి ఎలాగైనా రాబట్టాలనే ఉద్దేశంతో ఓ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు.


ఇందుకోసం తన స్నేహితులతో కలిసి ఓ మాస్టర్ ప్లాన్​ వేశాడు. తనను కిడ్నాప్ చేసినట్లు నాటకమాడి.. స్నేహితుల ద్వారా తండ్రిని రూ.30 లక్షలు అడిగించాడు. తెలంగాణకు ఆ డబ్బు పంపాలని డిమాండ్​ (Chennai kidnap drama) చేయించాడు. అంత డబ్బు తనతో లేదని అతడి తండ్రి చెప్పినా వినలేదు. ఇవ్వకపోతే నీ కొడుకుని చంపెస్తామని కూడా బెదిరింపులకు పాల్పడ్డారు యువకుడి (Short Film Director Kidnap Drama) స్నేహితులు.


ఇక చేసేదేమీ లేక.. ఆ యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించి కిడ్నాప్​ డ్రామాను బట్టబయలు చేశారు. ఈ డ్రామాకు కారణమైన ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం ఇలాంటి నాటకమాడాడని తెలిసి ఆ యువకుడి తండ్రి విస్తుపోయారు. నిజ జీవితంలో నాటకం బెడిసికొట్టడంతో ఆ యువకుడు కటకటాల పాలయ్యాడు.


Also read: Three Eyed Calf Died: మూడు కళ్లతో జన్మించిన వింత లేగదూడ మృతి.. పుట్టిన వారం రోజులకే!


Also read: Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌.. త్వరగా కోలుకోవాలని నేతల ఆకాంక్ష..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook