గుజరాత్ పాటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు కోట్లు ఇస్తే.. గుజరాత్ సీఎం సెక్స్ సీడీ చేస్తా..! అన్నారు. మంగళవారం జీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత జీవితాన్ని బజారుకు లాగడానికి శతవిధాలా బీజేపీ ప్రయత్నిస్తున్నది అని ఆయన చెప్పారు.  సెక్స్ సీడీ కంటే చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని.. అసలు అందులో ఉన్నది నేనో కాదో తెలీదు. నా వ్యక్తిగత జీవితం గురించి సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదన్నారు. 


ఇదే ఇంటర్వ్యూ లో - "ఆ సీడీ పూర్తిగా ఒక కట్టుకథ. మీరు నాకు రెండు కోట్లు ఇవ్వండి. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మొహాన్ని మార్ఫింగ్ చేసి సీడీ చేస్తా అని హార్దిక్ అన్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ పక్కనబెట్టి బీజేపీ నాపై చిల్లర రాజకీయాలు చేస్తోంది. ఇకపై నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. స్నానం చేస్తున్న సమయంలో బాత్రూమ్ కిటికీలను మూసేస్తానని సరదాగా వ్యాఖ్యానించారు. మే నెలలో ఒక హోటల్ లో హార్దిక ఓ మహిళతో గడిపినట్లు ఉండే సీడీ బయటకు రావడం సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే..!