పెళ్లంటే..  పచ్చని తోరణాలు, బాజాలు, భజంత్రీలు, బంధువుల కోలాహలం, డాన్స్ లు మొదలైన వాటితో సందడి సందడిగా ఉంటుంది. కానీ తమిళనాడులోని ఒక జంట మాత్రం ఇవేవీ లేకుండా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకొని ఔరా! అనిపించింది. అంతగా అనిపించేలా ఆ పెళ్లిలో ఏముందీ అనేగా మీ డౌట్? అయితే ఇది చదవండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 జి.అరవింద్, పి. పూవిజి అనే ఇద్దరు తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్యావరణ ప్రేమికులు. వీరిద్దరూ ఒక కృతిమ ద్వీపంలో చెట్ల పచ్చదనం మధ్యలో వివిధ ఆకులు, పూలతో చేసిన దండలను మార్చుకొని వివాహం చేసుకున్నారు. పర్యావరణాన్ని కాపాడటం, చెట్ల పెంపకం యొక్క ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ద్వీపంలో ఇలా వివాహం చేసుకున్నామని ఆ జంట తెలిపింది.  


వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయినా అరవింద్ మురికి, పొదలు మరియు ముళ్ళతో నిండిన ముకెనరీ సరస్సును చూసి చలించిపోయాడు. ఎలాగైనా మార్చాలని నిర్ణయించుకున్నాడు. 2011లో అతను ఇతర వాలంటీర్లతో కలిసి సరస్సు శుభ్రం చేసాడు. పర్యాటకులను, పక్షులను  ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని మార్చాడు. ఎన్డీటీవీ కధనం మేరకు, స్థానికులు ఈ సరస్సును తవ్వి, గట్టు చేసి ద్వీపాలను ఏర్పాటుచేసారు. అలా గట్లు కట్టుకుంటూ ఇప్పటివరకు కృతిమంగా 46 ద్వీపాలను ఏర్పాటుచేశారు. పెళ్లి కోసం మరో ద్వీపాన్ని ఏర్పాటు చేశారు. ద్వీపాలలో వివిధ రకాల మొక్కలను నాటారు. ఇప్పుడు ఆ ద్వీపాలు 12,000 చెట్లకు నిలయంగా ఉన్నాయి.


ఎకో- ఫ్రెండ్లీ మ్యారేజ్


ది హిందూ ఒక నివేదిక ప్రకారం, ఆ జంట.. పెళ్లికి హాజరయ్యేవారు చేనేత వస్త్రాలు ధరించిరావాలని కోరారు. పెళ్లికి వచ్చేవారు బహుమతులు తీసుకురావొద్దని, అందుకు బదులుగా నగదు ఇవ్వాలని కోరారు. ఆ వచ్చిన నగదు రూ.82,000 మొత్తాన్ని సరస్సు పునరుద్దరణకు తనతోపాటు కృషి చేసిన సేలం సిటిజన్స్ ఫోరమ్ కు విరాళంగా ఇచ్చారు. యాదృచ్ఛికంగా, ఆ జంట కూడా ఫోరమ్లో భాగంగా ఉన్నారు. వివాహం అనంతరం వచ్చిన అతిథులు మరియు జంట ద్వీపంలో 1,000 లకుపైగా మొక్కలను నాటారు. డైరెక్టర్స్ బాలాజీ శక్తివెల్, రాజు మురుగన్ ఈ వివాహానికి హాజరయ్యారు.